ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

96,544 మందికి ఇళ్ల పట్టాలు.. సిద్ధం చేస్తున్న అధికారులు

ABN, First Publish Date - 2020-12-16T04:10:06+05:30

జిల్లాలో 96,544 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పట్టాలను ముద్రించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అనేకసార్లు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది.

గంట్యాడ మండలం నరవలో వేసిన పేదల లేఅవుట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్థలాల కోసం ఇప్పటి వరకూ రూ.172 కోట్లు ఖర్చు 



కలెక్టరేట్‌, డిసెంబరు 15: జిల్లాలో 96,544 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పట్టాలను ముద్రించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అనేకసార్లు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. చివరికి ప్రభుత్వం ఈనెల 25న చేపట్టేందుకు ముహూర్తం ఖరారు చేసింది. జిల్లాలో ఇప్పటి వరకూ 1,164 లేవుట్లు వేయగా.. 12 చోట్ల కోర్టు కేసులు ఉన్నాయి. వాటిని మినహాయించి 1,152 లేఅవుట్లలో 71,237 మందికి పట్టాలు పంపిణీ చేయనున్నారు. కోర్టు కేసులు పరిష్కారమైతే... మిగతా వారికి పట్టాలు అందనున్నాయి. అలాగే 8,843  మందికి టిడ్కో పట్టాలు ఇదే సమయంలో అధికారులు అందజేయనున్నారు. 24,237 మందికి సొంత స్థలాలు ఉండటంతో వారికి పొజిషన్‌ పట్టాలు అందజేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆగస్టు నుంచి గత నెల 25 వరకూ స్పందన కార్యక్రమంలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న 2,642 మందికి (90 రోజుల కార్యక్రమం ప్రకారం) కూడా పట్టాలు అందజేయనున్నారు. మొత్తంగా ఈ స్థలాల కోసం ఇప్పటివరకూ రూ.172 కోట్లు కేటాయించారు. మరో రూ.35 కోట్లకు సంబంధించిన బిల్లులు అప్‌లోడ్‌ చేశారు. విజయనగరం పట్టణ వాసులకు 15వేల మందికి గుంకలాంలో అతి పెద్ద లేవుట్‌లో ఇళ్ల పట్టాలు అందజేయనున్నారు. ఈనెల 25 నుంచి నియోజకవర్గ ఎంఎల్‌ఏలు వీటిని పంపిణీ చేయనున్నారు. 


Updated Date - 2020-12-16T04:10:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising