ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారిక ఉత్సవంగా గురజాడ జయంతి

ABN, First Publish Date - 2020-09-19T11:07:37+05:30

మహాకవి గురజాడ అప్పారావు జయంతిని అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసినట్లు కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ తెలిపారు. ఈ నెల 21న ప్రభుత్వ ఆధ్వర్యంలో అఽధికారికంగా గురజా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తర్వులు విడుదల 


విజయనగరం(ఆంధ్రజ్యోతి), సెప్టెంబర్‌ 18: మహాకవి గురజాడ అప్పారావు జయంతిని అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని  ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసినట్లు కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ తెలిపారు. ఈ నెల 21న ప్రభుత్వ ఆధ్వర్యంలో అఽధికారికంగా గురజాడ జయంతి నిర్వహించడానికి ఏర్పాట్లు చెయ్యాలని అధికారులకు ఆదేశించారు. ఉత్సవ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని పేర్కొన్నారు.


గురజాడ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై డీఆర్వో గణపతిరావు శుక్రవారం అధికారులతో సమావేశమయ్యారు. ఈ నెల 21న ఘనంగా నిర్వహించాలని చెప్పారు. జిల్లా సంస్కృతీసంప్రదాయలకు అనుగుణంగా ఏర్పాట్లు చెయ్యాలని సూచించారు.  ఆ రోజు గురజాడ స్వగృహంలో ఉదయం 9 గంటలకు ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఆనంతరం ఆయన వినియోగించిన వస్తువులు పట్టుకుని పట్టణంలోని గురజాడ విగ్రహం వద్దకు వెళ్తామన్నారు. గతంలో భారీ ప్రదర్శన చేపట్టేవారమని, కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది కొద్దిమందితో అక్కడకు చేరుకుంటామని చెప్పారు.


ఉత్సవాన్ని పురస్కరించుకుని మహరాజా సంగీత కళాశాల విద్యార్థులతో గురజాడ దేశభక్తి గేయాలాపన, నృత్యాల ప్రదర్శన ఉంటుందన్నారు. ఉత్సవంలో కొవిడ్‌ నిబంధనలు విధిగా పాటించాలని నిర్దేశించారు. సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ, సెట్విజ్‌ సీఈవో నాగేశ్వరావు, గురజాడ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-19T11:07:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising