ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీకి ‘గద్దె’ రాజీనామా

ABN, First Publish Date - 2020-09-28T21:14:01+05:30

తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వ మాజీ విప్‌ గద్దె బాబురావు రాజీనామా చేశారు. విజయనగరంలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ పార్టీలో చేరేదీ త్వరలో నిర్ణయిస్తానని ప్రకటన


విజయనగరం: తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వ మాజీ విప్‌ గద్దె బాబురావు రాజీనామా చేశారు. విజయనగరంలోని ప్రముఖ హోటల్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశానన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొని.. ముందుకు సాగానని, ఎమ్మెల్యేగా చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశానని చెప్పారు. 2014, 2019లో టీడీపీ తనకు టిక్కెట్‌ కేటాయించలేదని, దీంతో తాను వేరే పార్టీకిలోకి వెళ్లినా, తిరిగి టీడీపీ గూటికి చేరానన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఇంకా కుదుట పడలేదని, ఈ పార్టీలో ఉంటే నియోజకవర్గ ప్రజలకు సేవ చేయలేనని తలచి టీడీపీ నుంచి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.


తాను.. ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతానని బాబురావు స్పష్టం చేశారు. కాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గద్దె బాబురావు రాజకీయ ప్రయాణమెటన్న విషయంలో దాదాపు స్పష్టత వచ్చింది. వైసీపీలోకి గతంలో వెళ్లి.. కొద్దికాలమే అక్కడుండి.. తిరిగి టీడీపీకి వచ్చేశారు.. తిరిగి వైసీపీలోకి వెళ్లే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీలోకి వెళ్లడం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే బీజేపీ జిల్లా నేతలు ఒక దఫా ఆయనతో మాట్లాడారని సమాచారం.


Updated Date - 2020-09-28T21:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising