ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాహిత మృతి కేసులో నలుగురి అరెస్టు

ABN, First Publish Date - 2020-12-20T05:28:47+05:30

వరకట్నం వేధింపులతో మహిళ మృతికి కారుకులైన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వరకట్న వేధింపులే కారణం  

 డీఎస్పీ మోహనరావు

గజపతినగరం/మెంటాడ, డిసెంబరు 19: వరకట్నం వేధింపులతో మహిళ మృతికి కారుకులైన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ కార్యాలయానికి శనివారం వచ్చిన ఆయన.. ఈ కేసుపై విలేకర్లతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మెంటాడ మండలం ఆగూరుకు చెందిన గెద్ద వెంకటేష్‌కు ఆరేళ్ల కిందట వసంతతో వివాహమయ్యింది. పెళ్లిలో కట్నం బకాయి ఉండడంతో భర్త వెంకటేష్‌తో పాటు అత్త లక్ష్మమ్మ, ఆడపడుచు శారద, బావ మహేష్‌లు తరుచూ వేధింపులకు గురి చేశారు. దీంతో వసంత ఈనెల 17న ఉరి పోసుకొని మృతి చెందినట్టు ఆయన తెలిపారు. ఈమేరకు శనివారం ఆగూరు గ్రామంలో దర్యాప్తు చేపట్టామన్నారు. దర్యాప్తు అనంతరం ఆ నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. దర్యాప్తులో ఆండ్ర ఎస్‌ఐ షేక్‌ శంకర్‌ ఉన్నారు. సమావేశంలో గజపతినగరం ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు పాల్గొన్నారు.  

 

Updated Date - 2020-12-20T05:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising