ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాలకు సౌకర్యాలు కల్పిస్తాం

ABN, First Publish Date - 2020-02-20T10:55:59+05:30

మండలంలోని అన్ని గ్రామ సచివాలయాలకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని మండల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండల ప్రత్యేకాధికారి ధర్మారావు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌ 


సంతోషపురం(గరుగుబిల్లి), ఫిబ్రవరి 19: మండలంలోని అన్ని గ్రామ సచివాలయాలకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని మండల ప్రత్యేకాధికారి కె.ధర్మారావు చెప్పారు. సచివాలయాలలో మౌలిక సదుపాయలు లేని విషయమై ‘ఇదేమి విధిరాత’ శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై ఆయన స్పందించారు. సంతోషపురం సచివాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయాలకు అవసరమైన కంప్యూటర్లు, స్టేషనరీ, బయోమెట్రిక్‌ స్కానర్లు, ప్రింటర్లు, టేబుల్స్‌, ఫోన్లు కొంతమేర సమకూర్చినట్లు చెప్పారు. సచివాలయాలకు దశల వారీగా సామగ్రి సమకూరుస్తున్నారని, కొరత ఉన్న వాటి విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళుతున్నట్లు తెలిపారు. సిబ్బంది అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే పూర్తిస్థియిలో సదుపాయాలు కల్పిస్తామన్నారు. సచివాలయాల పరిధిలోని సమస్యలను కార్యదర్శి జె.పాపారావును అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో తహసీల్దార్‌ వి.వి.సన్యాసిశర్మ, ఎంపీడీవో జి.గిరిబాల, ఉపాధి హామీ పథకం ఏపీవో వైజనార్దనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T10:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising