ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగాదిపై కరోనా ప్రభావం

ABN, First Publish Date - 2020-03-25T11:24:58+05:30

తెలుగువారికి ఉగాది పండుగ ఎంతో ప్రత్యేకం. ధనిక, పేద, మధ్యతరగతి తారతమ్యం లేకుండా అందరూ భక్తిశ్రద్ధలతో,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూతపడిన ఆలయాలు 

పంచాంగ శ్రవణాలు రద్దు 

ఇంటి వద్దే వేడుకలు


(విజయనగరం రూరల్‌) : తెలుగువారికి ఉగాది పండుగ ఎంతో ప్రత్యేకం. ధనిక, పేద, మధ్యతరగతి తారతమ్యం లేకుండా అందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను నిర్వహిస్తారు. ఉగాది రోజున ఇంటిల్లిపాది షడ్రుచులతో తయారుచేసిన పచ్చడిని తింటారు. అంతకుముందు ఆల యాలకు వెళ్లి పూజలు చేస్తారు. ఈసారి మాత్రం ఉగాదిపై కరోనా ప్రభావం పడింది. కరోనా వైరస్‌ నిరోధక చర్యల్లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో దేవాల యాలన్నీ మూసివేశారు. ఉగాది పచ్చడి తయారీకి ఇబ్బంది లేకపోయినా, ఎవరి ఇంట్లో వారు ఉగాది పచ్చడి తిని ఆనందించాల్సిందే. లాక్‌డౌన్‌ కారణంగా ఆరుబయట తిరగకూడదన్న నిబం ధనతో ఉగాది రోజు ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఉగాది రోజున బంగారం, వెండిని వారి ఆర్థిక పరిస్థితిని బట్టి కొత్త వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది వ్యాపా ర, వాణిజ్య సంస్థలు మూసివేయడంతో కొత్త వస్తువుల కొనుగోలుకు దాదాపు బ్రేక్‌ పడినట్టే. 


పంచాంగ శ్రవణాలు లేవు...

ఉగాది రోజున సంప్రదాయం ప్రకారం పంచాంగ శ్రవ ణం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది దేశం పరి స్థితి ఎలా వుంది? పాలకులు, పంటలు, వాతావరణం ఇలా పలు అంశాలను పండితులు పంచాంగ శ్రవణంలో వివరిస్తారు. రాశి ఫలాలు చెబుతారు. ఈ ఏడాది కరోనా ప్రభావంతో  ఎక్కడికక్కడ ఆంక్షలు ఉన్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు రద్దయ్యాయి.  మునుపెన్నడూ లేని విధంగా తెలుగు సంవత్సరాదిన.. ఎటువంటి సందడి లేకుండా ఉగాది జరుపుకోవడం బహుశా ఇదే కాబోలు.

Updated Date - 2020-03-25T11:24:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising