ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజాభివృద్ధికి విద్యే మూలం

ABN, First Publish Date - 2020-05-28T09:30:21+05:30

విద్య ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని భావించిన ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(విజయనగరం-ఆంధ్రజ్యోతి): విద్య ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని భావించిన ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఏడాది ప్రభుత్వ పాలనను పురస్కరించుకుని చేపట్టిన మన పాలన- మీ సూచన మూడోరోజు కార్యక్రమం బుధవారం డీఆర్‌డీఏ కార్యా లయంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ విద్య ద్వారా నే సమాజంలోని పేదరికాన్ని పారదోలడం సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరికీ విద్యావ కాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చర్యలు చేపడు తున్నా రన్నారు. విద్యా రంగంలో సంస్కరణలు తీసుకు వస్తున్నా మని, వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు రాబోతు న్నాయన్నారు. మన బడి, నాడూ-నేడు ద్వారా అన్ని పాఠశాలలకు కార్పొరేట్‌ స్థాయి వసతులు కల్పిస్తామన్నారు. తల్లి దండ్రులకు విద్య భారం కాకూడదనే ఉద్దేశంతో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమా లు చేపట్టామ న్నారు. కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల, ఉపాధ్యాయ శిక్షణ కళాశాల మంజూరు చేశామన్నారు. కలెక్టర్‌ హరిజవహర్‌ లాల్‌ మాట్లా డుతూ సమా జంలో మార్పు తెచ్చే శక్తి విద్యకే ఉందన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా బొప్పడాం ఉన్నత పాఠశాల విద్యార్థి అభిమన్యు, బాలు డి తల్లి కాంత మాట్లాడారు. కార్యక్రమంలో జెసీ-2 ఆర్‌.కూర్మనాథ్‌, ట్రైనీ సహాయ కలెక్టర్‌ కట్టా సింహాచలం, డీఈవో నాగమణి, ఎస్‌ఎస్‌ఏ పీవో కృష్ణమూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-28T09:30:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising