ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది టన్నులు దాటితే ఎరువుల డోర్‌ డెలివరీ

ABN, First Publish Date - 2020-06-07T06:50:29+05:30

ఖరీఫ్‌ సీజన్‌లో ఏ గ్రామం నుంచైనా పదిటన్నులకు పైగా ఎరువుల కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బొబ్బిలి, జూన్‌ 6: ఖరీఫ్‌ సీజన్‌లో ఏ గ్రామం నుంచైనా పదిటన్నులకు పైగా ఎరువుల కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే  డోర్‌డెలివరీ చేస్తామని బొబ్బిలి వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టరు మాలకొండయ్య తెలిపారు. శనివారం ఆయన  మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల కు పంపిణీ చేస్తున్న ఎరువులు, విత్తనాల నుంచి 40చొప్పున నమూనాలు సేకరించి నాణ్యతా పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపిస్తామన్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారని తెలిపారు. ప్రైవేట్‌ సంస్థలు ఇచ్చేవే కాకుండా ప్రభుత్వం ద్వారా వచ్చే వాటిని కూడా పరీక్షలకు పంపిస్తామని చెప్పారు.


నాణ్యతా పరీక్షల రిపోర్టులు అందిన తరువాతే రైతులకు విక్రయిస్తామన్నారు. డీఏపీ, యూరియా, మొక్క జొన్న, పత్తి విత్తనాలను పరీక్షల కోసం పంపగా అవి సక్రమంగా ఉన్నట్లు రిపోర్టు వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో  నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఫదీరాబాద్‌ చెన్నైలో ప్రత్యేక శిక్షణ పొందిన అఽధికారులు  వైఎస్సార్‌ అగ్రి ల్యాబ్‌లకు ఇన్‌ చార్జిలుగా వ్యవహరిస్తారన్నారు. ఏవోలు శ్యామ్‌సుందర్‌, సూరి నాయుడు, గోకుల్‌ కృష్ణ, సునీల్‌కుమార్‌, అవినాష్‌ ఉన్నారు. 

Updated Date - 2020-06-07T06:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising