ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పైడితల్లమ్మ పండగకు వెళ్లొద్దు

ABN, First Publish Date - 2020-10-24T10:58:59+05:30

విజయనగరంలో పైడితల్లమ్మ ఉత్సవానికి ఈ ప్రాంతం నుంచి ఎవరూ వెళ్లొద్దని ఎల్విన్‌పేట ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 23: విజయనగరంలో పైడితల్లమ్మ  ఉత్సవానికి ఈ ప్రాంతం నుంచి ఎవరూ వెళ్లొద్దని ఎల్విన్‌పేట ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం ఆయన గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ పరిసరాల్లో గ్రామ ప్రజలతో సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో ప్రజలెవరూ పైడితల్లమ్మ పండగకు వెళ్లొద్దని హితవు పలికారు. ఆయన వెంట హెడ్‌ కానిస్టేబుల్‌ దొర, రాజు, తదితరులు ఉన్నారు. ఫ  నెల్లిమర్ల: ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా విజయనగరంలో పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవాన్ని తిలకించేందుకు ఎలాంటి అనుమతులు లేవని విజయనగరం రూరల్‌ సీఐ టీఎస్‌ మంగవేణి అన్నారు. ఈమేరకు నెల్లిమర్లలో విద్యార్థులతో పోలీస్‌ సిబ్బంది, నగర పంచాయతీ కార్యాలయ సిబ్బంది శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.


ఈ ర్యాలీని ఉద్దేశించి సీఐ మాట్లాడుతూ పైడితల్లమ్మ ఉత్సవాలకు బయటి గ్రామాల వ్యక్తులను పట్టణంలోకి అను మతించడం లేదని, ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలని అన్నారు.  కార్యక్రమంలో కమిషనర్‌ జె.రామఅప్పలనాయుడు, ఎస్‌ఐ దామోదరరావు పాల్గొన్నారు. ఫ శృంగవరపుకోట రూరల్‌ (జామి): విజయనగరం పైడితల్లమ్మ సిరిమాను సంబరానికి ఎవ్వరూ రావొద్దని ఇంట్లో ఉండి టీవీల్లో తిలకించాలని జామి ఎస్‌ఐ సుదర్శన్‌ కోరారు. ఈమేరకు మండలంలో శుక్రవారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ గోపి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-24T10:58:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising