ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాన్సాస్‌ ఉద్యోగులకు జీతాల చెల్లింపు

ABN, First Publish Date - 2020-08-13T10:12:03+05:30

మాన్సాస్‌ సంస్థలో పనిచేస్తున్న అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి జీతాలు చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తంగా 12 విద్యా సంస్థల్లో ప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  విజయనగరం రూరల్‌:  మాన్సాస్‌ సంస్థలో పనిచేస్తున్న అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి జీతాలు చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తంగా 12 విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారికి జీతాలు అందలేదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ నెల 10న ‘గడ్డుకాలం’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది.. దీనిపై కూడా విస్తృతస్థాయిలో చర్చ జరిగింది.. హైకోర్టులో కేసు విచారణ జరగడంతో ఈ విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.


కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు తరఫున న్యాయవాది కూడా ఈ కథనాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ఈ నెల 11 నుంచి మాన్సాస్‌ సంస్థలో పనిచేస్తున్న అధ్యాపకులకు జీతాలు చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది.. నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ విషయానికి వస్తే వారికి   879 మంది ఉద్యోగులకు బకాయిపడ్డ    నాలుగు నెలల జీతాన్ని కూడా ఈ నెల 18 లోపు అందించేందుకు   అధికారులు  ఏర్పాట్లు చేస్తున్నారు.   దీంతో మాన్సాస్‌ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఫ మాన్సాస్‌ ట్రస్టు  ఇన్‌చార్జి ఈవోగా మాధవి ఈ నెల 11 సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.


ప్రస్తుతం ఆమె విశాఖపట్టణం కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మాన్సాస్‌ ఈవో పోస్టు దశాబ్ద కాలంగా ఖాళీగా ఉంది.. తాజాగా ప్రభుత్వం ఇన్‌చార్జి ఈవోగా మాధవికి బాధ్యతలు అప్పగి స్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమె మాన్సాస్‌ ప్రస్తుత చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన మాధవిని మాన్సాస్‌ ఉద్యోగులు, సిబ్బంది బుధవారం శుభాకాంక్షలు తెలిపారు

Updated Date - 2020-08-13T10:12:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising