ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుమ్మలక్ష్మీపురం కేంద్రంగా డైట్‌ కళాశాల

ABN, First Publish Date - 2020-12-10T05:30:00+05:30

గిరిజన ప్రాంతమైన గుమ్మలక్ష్మీపురం కేంద్రంగా ఈ ఏడాది నుంచి డైట్‌ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ జోన్‌-1 ఆర్జేడీ కె.నాగేశ్వరరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుమ్మలక్ష్మీపురం, డిసెంబరు 10: గిరిజన ప్రాంతమైన గుమ్మలక్ష్మీపురం కేంద్రంగా ఈ ఏడాది నుంచి డైట్‌ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ జోన్‌-1 ఆర్జేడీ కె.నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన గుమ్మలక్ష్మీపురంలో ప్రభుత్వ డైట్‌ కళాశాల ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా విలేక రులతో మాట్లాడారు. కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 35 లక్షలు మంజూ రు చేసిందని, డైట్‌ తరగతుల నిర్వహణ, విద్యా బోధనకు స్థానికంగా ఉన్న వివిధ పాఠశాలల సీనియర్‌ ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోనున్నామని తెలి పారు. జిల్లాలో నాడు - నేడు పథకంలో భాగంగా 270 పాఠశాలల్లో పనులు పూర్త య్యాయన్నారు. అమ్మఒడి పథకానికి అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసు కోవచ్చన్నారు. పక్కా భవనాలు నిర్మించే వరకూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ మోడల్‌ పాలిటెక్నిక్‌ కళాశాల భవనాలను వినియోగించుకోనున్నామన్నారు. విజయనగరం ప్రభుత్వ డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌.తిరుపతినాయుడు, ఐటీడీఏ గిరిజన సంక్షే మశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పి.కిరణ్‌కుమార్‌,  డైట్‌ కళాశాల  ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఆర్‌ ఎస్‌వీజీ కృష్ణారావు, పాలి టెక్నికల్‌ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ నరసింహన్‌, గురు కుల ఓఎస్‌డీ బి.కృష్ణ, గిరిజన సంక్షేమశాఖ ఏఈ శ్యామ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-10T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising