ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 1232 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు

ABN, First Publish Date - 2020-07-06T10:14:40+05:30

రిజన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి రూ. 1232 కోట్లతో పనులను చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మం త్రి పాముల ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి


గుమ్మలక్ష్మీపురం, జూలై 5: గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి రూ. 1232 కోట్లతో పనులను చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మం త్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఆదివారం ఆమె గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ రోడ్ల నిర్మాణంలో గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, రహదా రులు లేని గిరిశిఖర గ్రామాలకు రోడ్లను వేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం ఎగువమండ, వంజరాపుగూడ గ్రామాలకు నిర్మించిన రహదారులతో పాటు డోకులగూడ నుంచి పుట్టజమ్ము వరకు నూతనంగా నిర్మిం చిన బీటీ రోడ్లను,  కురుపాం మండలం గుడివాడ పంచాయతీ లోమడ, బియ్యాల వలస పంచాయతీ పెళ్లివలస గ్రామ రహదారులను ఆమెతో పాటు అరకు పార ్లమెంటరీ వైసీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు ప్రారంభించారు.


రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ గిరిజన ప్రాంతాల్లో నిర్మాణాలకు మొత్తం రూ. 1232 కోట్లను వ్యయం చేస్తున్నామన్నారు.  రోడ్లు లేని గ్రామాలకు ముందుగా రోడ్‌ ఫార్మేషన్‌ పనులు చేపట్టడానికి ఆరు ఐటీడీ ఏల పరిధిలో 236  పనుల కోసం రూ. 23.50 కోట్లు మంజూరు చేశామని డిప్యూటీ సీఎం వివరించారు. కార్యక్రమంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం వైసీపీ మండల కన్వీనర్లు ఇంటికుప్పల గౌరీశంకర్‌, కె.దీనమయ్య, కురుపాం మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పద్మావతి, మాజీ ఎంపీపీ ఇందిరాకుమారి, వైసీపీ నాయకులు ఎన్‌.శేఖర్‌, జి.గిరిబాబు, గిరిజన సంక్షేమశాఖ ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-06T10:14:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising