ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ వల్ల ఉపాధ్యాయుడి కుటుంబం సొంతూరికి వెళ్లిందని ఆ డిగ్రీ విద్యార్థికి తెలిసి..

ABN, First Publish Date - 2020-08-05T20:27:34+05:30

పట్టణ పరిధిలో ఉపాధ్యాయ దంపతుల ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీ సులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగారు ఆభరణాల చోరీలో ఇద్దరు అరెస్టు


బొబ్బిలి/విజయనగరం(ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధిలో ఉపాధ్యాయ దంపతుల ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీ సులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్‌పీ జె.పాపారావు, ట్రైనీ డీఎస్‌పీ జెస్సీ ప్రశాంతి, సీఐ ఇ. కేశవరావు ఈవివరాలను వెల్లడించారు. కురుపాం గ్రామానికి చెందిన  ఉపాధ్యాయులు బిడ్డిక ఆశాజ్యోతి, ఆమె భర్త ఉదయ్‌కుమార్‌ స్థానిక నాయుడుకాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. లాక్‌డౌన్‌ వల్ల వారు స్వగ్రామానికి వెళ్లారు.   కురు పాం ప్రాంతానికే చెందిన గొట్టిపల్లి దినేష్‌ అనే యువకుడు నాయుడుకాలనీలోనే ఉంటూ డిగ్రీ చదువుకుంటున్నాడు. ఉపాధ్యాయ దంపతులు లేని విషయాన్ని గమనించి ఆ యువకుడు గత నెల 27న వారి ఇంట్లో చొరబడి సుమారు  రూ. 7 లక్షల విలువైన 14 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. గత నెలా ఖారున  కురుపాం నుంచి ఉపాధ్యాయ దంపతులు బొబ్బిలి వచ్చారు. ఇంట్లో చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ట్రైనీ డీఎస్‌పీ, సీఐ, ఐడీ పార్టీ సిబ్బంది సహకారంతో చోరీకి పాల్పడిన నిందితుడు గొట్టిపల్లి దినేష్‌ను కొద్దిరోజుల్లోనే పట్టుకో గలిగారు. చోరీ సొత్తును శ్రీకాకుళం జిల్లా పోలాకి  మండలం పిన్నింటిపేటకి చెందిన సకలాబత్తుల ఆనందరావు సహకారంతో నరసన్న పేటలో విక్రయించాలని చూస్తుండగా, నిందితులు పోలీసులకు పట్టుబడ్డాడు. దినేష్‌ ఉంటున్న గదిలో వెండిగ్లాసులనూ స్వాధీనం చేసుకొని నిందితులను మం గళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్‌పీ పాపారావు తెలిపారు.  కేసును ఛేదించిన  ట్రైనీ డీఎస్‌పీ ప్రశాంతి, సీఐ కేశవరావు, ఐడీ పార్టీ ఏఎస్‌ఐ శ్యామ్‌, హెచ్‌సీ మురళి, శ్రీరామ్‌ను ఎస్‌పి అభినందించారని ఆయన తెలిపారు.

Updated Date - 2020-08-05T20:27:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising