పెట్రోల్‌తో సీఆర్‌టీ అభ్యర్థుల నిరసన
ABN, First Publish Date - 2020-12-31T05:21:51+05:30
సీఆర్‌టీ ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ రిలే దీక్ష చేస్తున్న 2019 సీఆర్‌టీ మెరిట్ అభ్యర్థులు ఐటీడీఏ కార్యాలయం వద్ద పెట్రోల్ పట్టుకుని మరీ తమ నిరసనను తెలియజేశారు.
పార్వతీపురం, డిసెంబరు 30: సీఆర్‌టీ ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ రిలే దీక్ష చేస్తున్న 2019 సీఆర్‌టీ మెరిట్ అభ్యర్థులు ఐటీడీఏ కార్యాలయం వద్ద పెట్రోల్ పట్టుకుని మరీ తమ నిరసనను తెలియజేశారు. బుధ వారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరం భవనం పైకి ఎక్కి తమకు ఉద్యోగాలు కల్పించాలని నినాదాలు చేశారు. రిలే దీక్షలకు మద్దతుగా బుధవారం రాత్రి వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. సోమవారం నుంచి పునఃప్రారంభమైన రిలే దీక్ష కార్యక్రమంలో భాగంగా బుధవారం గిరిమిత్ర సమావేశ భవనం పైకి ఎక్కి తమ డిమాండ్లను పరిష్కరించకపోతే దూకే స్తామంటూ నినాదాలు చేయడంతో పోలీసులు అక్కడ చేరుకుని పరిస్థితిని పర్యవే క్షించారు. సీఐ లక్ష్మణరావు వారితో మాట్లాడినా ఆందోళన విరమించలేదు.
Updated Date - 2020-12-31T05:21:51+05:30 IST