ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయండి

ABN, First Publish Date - 2020-11-22T04:55:57+05:30

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జేసీ వెంకటరావు ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ వెంకటరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  విజయనగరం (ఆంధ్రజ్యోతి) నవంబరు 21 :

  ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జేసీ వెంకటరావు ఆదేశించారు. శనివారం డీఆర్‌డీఏ కార్యాలయ సమవేశ మందిరంలో  అధికారులు, బ్యాంకర్లతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  వైఎస్‌ఆర్‌ బీమా, చేయూత, జగన్న తోడు పఽథకాల పురోగతిపై చర్చించారు.  పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు, వారి ఎంపిక పక్రియలో  నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 6,97,161 మంది బియ్యం కార్డుదారులు ఉండగా, ఇప్పటివరకు 5,92,308 మంది వివిధ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నారని జేసీ వెల్లడించారు. సర్వే ద్వారా మిగతా వారిని గుర్తించి  సంక్షేమ పథకాలు అందించాలని మెప్మా పీడీ, డీఆర్‌డీఏ అధికారులకు సూచించారు. 18ఏళ్లు, 70 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న వారి వివరాలు ప్రత్యే కంగా సేకరించాలన్నారు. చేయూత, జగనన్న తోడు పథకాల లబ్ధిదారులతో బ్యాంకు ఖాతాలు తెరిపించాలని ఆదేశించారు.  ఈ విషయంలో అధికారులకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. సమన్వయంతో పనిచేసి లబ్ధిదారుల సమస్యలు పరిష్కరించాలన్నారు.  సమావేశంలో  డీఆర్‌డీఏ పీడీ కె.సుబ్బారావు, మెప్మా పీడీ సుగుణాకరరావు, పశుసంవర్థక శాఖ జేడీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2020-11-22T04:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising