ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్యాలను త్వరగా పూర్తి చేయండి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-09-23T11:12:57+05:30

ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌, సెప్టెంబరు 22:   ప్రభుత్వ సంక్షేమ పథకాల లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ఆదేశించారు.  మంగళవారం వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చతోరణ కార్యక్రమంలోని కొన్ని శాఖలు చాలా వెనుకబడి ఉన్నా యన్నారు. కొన్ని శాఖలు కనీస శ్రద్ధ పెట్టడం లేదన్నారు.


ఈ పద్ధతి మార్చుకోవాలని   సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చ రించారు. ఏదేమైనా ఈనెలాఖరు లోగా పచ్చతోరణం లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.


 కొనసాగుతున్న సచివాలయ పరీక్షలు 

 జిల్లాలోని సచివాలయాల్లో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న పరీక్షలు మూడో రోజు మంగళవారం కూడా సజావుగా సాగాయి.  ఉదయం  నిర్వహించిన పరీక్షకు 2,482 మంది అభ్యర్థులకు గనుఉ 1811 మంది హాజరయ్యారు. 72.97 శాతం హాజరు నమోదైంది.  మధ్యాహ్నం జరిగిన పరీక్షకు  1204 మందికి 943 మంది  రాశారు. మొత్తంగా 78.32 శాతం హాజరు నమోదైంది.


  ప్రతి కేంద్రంలోని కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారి కోసం ఐసోలేషన్‌ గదులు ఏర్పాటు చేశారు.  ఇదిలా ఉండగా విజయనగరంలోని గాజులురేగ సత్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ సందర్శించారు. కళాశాల ప్రవేశ మార్గంలో అభ్యుర్థులందరికీ శానిటైజ్‌ చేస్తున్నారా? లేదా అన్నది! పరిశీలించారు.  పరీక్షలు పక్కా నిర్వహించాలని అక్కడున్న సిబ్బందికి సూచించారు.  

Updated Date - 2020-09-23T11:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising