ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనాభివృద్ధికే శతశాతం నిధుల వినియోగం

ABN, First Publish Date - 2020-11-04T04:14:01+05:30

గిరిజనుల కోసం కేటాయించిన నిధులు శతశాతం వారి కోసమే వినియోగించాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరి యంలో గిరిజన ఉప ప్రణాళిక జిల్లా మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కలెక్టరేట్‌, నవంబరు 3:

గిరిజనుల కోసం కేటాయించిన నిధులు శతశాతం వారి కోసమే వినియోగించాలని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరి యంలో గిరిజన ఉప ప్రణాళిక జిల్లా మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో గిరిజనులకు సహాయ సహకారాలు అందేలా చూడాలన్నారు.  ఏ ఒక్కరికీ ‘ రైతు భరోసా’  పెండింగ్‌ ఉండకూడదన్నారు. రెండు రోజులు పార్వతీపురంలోనే ఉండి ఇంటింటి సర్వే చేయాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆశా దేవిని ఆదేశించారు.  తృణధాన్యాలు ఎగుమతి చేసుకునేలా గిరిజన రైతులకు మార్కెటింగ్‌ స్కిల్స్‌ నేర్పించాలన్నారు. ఇందు కోసం వచ్చే మూడేళ్లకు ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు.  ప్రతి గ్రామానికీ తాగునీటి ప్రాజెక్టులు, రహదారులు ఉండాలని, విద్యుత్‌ లేని గ్రామం , వార్డు ఉండకూ డదని తెలిపారు. విద్యుత్‌ లేని, లో వోల్జేజ్‌ సమస్య ఉన్న వాటిని ఆయా మండల ప్రత్యే కాధికారులు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజన రైతులకు అవసరమైన మోటార్లు ఇవ్వాలని, అదనపు ట్రాన్స్‌ ఫార్మర్లను  ఏర్పాటు చేయాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ విష్ణుకి సూచిం చారు. గర్భి ణులు వసతిగృహంలో ప్రసవం జరిగే వరకూ పర్య వేక్షించాలన్నారు. గుమ్మడి గెడ్డ ప్రాజెక్టు  నిధుల కోసం లేఖ రాయాలని జల వనరులు శాఖ అధికారు లకు సూచించారు. అంతక ముందు ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ మాట్లాడుతూ ప్రతి శాఖ తన నిధుల్లో 6.6 శాతం గిరిజన అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని తెలిపారు. కొన్ని శాఖలు ఇంకా లక్ష్యాలను చేరుకోలే దన్నారు. సమావేశంలో అటవీ శాఖాధికారి సచిన్‌ , సహాయ కలెక్టర్‌ సింహాచలం తదితరులు ఉన్నారు.

  

Updated Date - 2020-11-04T04:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising