ప్రశాంతంగా జేఈఈ పరీక్షలు
ABN, First Publish Date - 2020-09-03T10:34:48+05:30
విజయనగరంలోని సత్య ఇంజినీరింగు కళాశాలలో రెండో రోజు మంగళవారం జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కరోనా
విజయనగరం రూరల్, సెప్టెంబరు 2: విజయనగరంలోని సత్య ఇంజినీరింగు కళాశాలలో రెండో రోజు మంగళవారం జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కరోనా నిబంధనల నడుమ ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైన ఈ పరీక్షలు మరో నాలుగు రోజులు పాటు జరగనున్నాయి. బుధవారం తొలి విడత ఉదయం 258 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 231 మంది హాజరయ్యారు.
27 మంది హాజరుకాలేదు. రెండో విడత మధ్యాహ్నం 259 మంది హాజరుకావల్సి ఉండగా, 235 మంది హాజరయ్యారు. 24 మంది హాజరుకాలేదు. ఇదిలా ఉండగా వినియోగించిన మాస్క్‌లు, తదితర వాటిని కళాశాల ఆరు బయట ఇష్టారాజ్యంగా పడేస్తున్నారు. పారిశుధ్య విభాగం సిబ్బంది దీనిని శుభ్రం చేయడం లేదు. దీంతో రెండో రోజు పరీక్షకు హాజరైన వారు ఇబ్బందులకు గురయ్యారు.
Updated Date - 2020-09-03T10:34:48+05:30 IST