ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండలనడుమ కోనేటిరాయుడు వెలిసేనా?

ABN, First Publish Date - 2020-03-16T10:11:07+05:30

మండలంలోని పద్మాపురం పంచాయతీ మాల మామిడి గ్రా మ సమీపంలో జాతీయ రహదారి ఘాట్‌రో డ్డు పక్కన ఎత్తైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్వేలకే పరిమితం వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం 

మాలమామిడి వద్ద సర్వే.. అనంతరం పట్టించుకోని వైనం

ప్రకృతి అందాలు ఈ ప్రాంతం సొంతం

ఆలయం నిర్మిస్తే ఆధ్యాత్మికంగా అభివృద్ధి


పాచిపెంట, మార్చి 15: మండలంలోని పద్మాపురం పంచాయతీ మాల మామిడి గ్రా మ సమీపంలో జాతీయ రహదారి ఘాట్‌రో డ్డు పక్కన ఎత్తైన కొండలపై వేంకటేశ్వరస్వా మి ఆలయ నిర్మాణానికి అధికారులు సర్వేలు పలు మార్లు చేసినా, పనులు ప్రారంభించక పోవడంపై ఈ ప్రాంత వాసులు అసం తృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఐదునెలల కిందట సుమారు 5 ఎకరాల్లో సర్వే చేసి నిర్థారించారు. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, టీటీడీ అధికారులు వేర్వేరుగా రెండుమూడుసార్లు వచ్చి ఈస్థలాన్ని పరిశీలించారు.


ఆలయ నిర్మాణానికి అనువుగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈఆలయ నిర్మాణాన్ని టీటీడీ   చర్యలు చేపట్టింది. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశించారు. అయితే, ఇప్పటికీ నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఎత్తైన కొండలు, ప చ్చనిచెట్లు, ఆహ్లాదకర వాతావరణం, పడమటివైపు దక్షిణ నుంచి ఉత్తరకు పారే కొండవాగు కలిగి ఉన్న ఈప్రాంతంలో  ఆలయం నిర్మిస్తే భక్తులుఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందనడంలో అతిశయోక్తికాదు.


తిరుమలను తలపించే ఘాట్‌రోడ్డు

తిరుమలను తలపించే విధంగా మలుపులతో కూడిన ఘాట్‌రోడ్డు ఉంది. మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు నుంచి ఆలయ నిర్మాణం తలపెట్టే మాలమామిడి వరకు సుమారు 3 కిలోమీటర్లు ఇరువైపులా ప్రకృతి అందాలు అందరిని ఆకట్టుకుంటాయి.

Updated Date - 2020-03-16T10:11:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising