ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడిగెడ్డ రిజర్వాయర్‌ పనులకు బ్రేక్‌!

ABN, First Publish Date - 2020-11-23T05:21:42+05:30

మండలంలో తాతావారి కిత్తలి సమీపంలో ఉన్న గడిగెడ్డ రిజర్వాయర్‌ పనులు నిలిచిపోయాయి.

గడిగెడ్డ రిజర్వాయర్‌ ఇలా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుర్ల:

మండలంలో తాతావారి కిత్తలి సమీపంలో ఉన్న గడిగెడ్డ రిజర్వాయర్‌  పనులు నిలిచిపోయాయి. దీంతో సాగు, తాగునీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ గెడ్డవాగులోకి తోటపల్లి పిల్ల కాలువ నీరు అందించాల్సి ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  వాస్తవంగా రిజర్వా యర్‌ గట్టు ఎత్తు పెంచే ఆలోచనతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో హడావిడిగా పనులు ప్రారంభించారు. పూర్తిస్థాయిలో సాగునీరు అందు తుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే  ప్రస్తుతం ఆ పనులు  ఆగిపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అసలు మండ లంలో పాలవలస, పల్లిగండ్రేడు, బూర్లెపేట, గరికివలస, నక్కలపేట, తెట్టంగి, పోలయ వలస, గూడెం, కెంగువ, కలవచర్ల, గుర్ల, గోషాడ, పున్నపురెడ్డిపేట తదితర గ్రామాలకు రిజర్వాయర్‌ ద్వారా సాగునీరు అందుతుంది. మొరక ముడిదాం, గరివిడి, చీపురుపల్లి మండలాల్లో ఉన్న గ్రామాలకు ,  వేసవికాలంలో విజయనగరానికి కూడా తాగునీరు అందుతోంది. అయితే రూ.19 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకునే వారే  కరువయ్యారు.  ఈ విషయాన్ని  మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి  అధికారులు తీసుకెళ్లారు. దీనిపై నీటి పారుదలశాఖ ఏఈ శ్రీనివాసరావును వివరణ కోరగా అభివృద్ధి పనులు కొంతమేర ఆగినట్లు తెలిపారు.  త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. 

 


 

Updated Date - 2020-11-23T05:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising