రహదారుల దుస్థితిపై బీజేపీ నిరసన
ABN, First Publish Date - 2020-12-06T05:04:00+05:30
అధ్వాన రహదారులపై బీజేపీ ఉద్యమం ఆరంభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు మేరకు జిల్లాలోని పార్టీ నేతలంతా శనివారం నిరసన చేపట్టారు.
సాలూరు రూరల్, డిసెంబరు 5: అధ్వాన రహదారులపై బీజేపీ ఉద్యమం ఆరంభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు మేరకు జిల్లాలోని పార్టీ నేతలంతా శనివారం నిరసన చేపట్టారు. సాలూరు లోని బంగారమ్మపేట సమీపంలోగల అధ్వాన రహదారి వద్ద బీజేపీ నియోజ కవర్గ కన్వీనర్ గంటా అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు అందించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వహిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సూర్యనారాయణ, సత్యనారాయణ, మణికంఠ, సింహాచలం, మురళి తదితరులు పాల్గొన్నారు.
గజపతినగరం: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా జాతీయ రహదారి అధ్వానంగా తయారయ్యిందని బీజేపీ నియోజకవర్గ సమన్వయకర్త దేవర ఈశ్వరరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జాతీయ రహదారిపై ఉన్న గోతులకు మరమ్మతులు చేపట్టాలని శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏడుకొండలు, మండపాక భారతి, కేఎస్‌ఎన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-06T05:04:00+05:30 IST