పర్యావరణ హిత దీపావళిపై అవగాహన
ABN, First Publish Date - 2020-11-14T04:27:51+05:30
దీపాలతోనే దీపావళి జరుపుకుందామని సీఐ ఇ.కేశవరావు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు తూముల కార్తీక్ పిలుపునిచ్చారు. శుక్ర వారం రాత్రి స్థానిక తాండ్రపాపారాయ జంక్షన్‌లో రోటరీక్లబ్, కారుణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
బొబ్బిలి, నవంబరు 13:
దీపాలతోనే దీపావళి జరుపుకుందామని సీఐ ఇ.కేశవరావు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు తూముల కార్తీక్ పిలుపునిచ్చారు. శుక్ర వారం రాత్రి స్థానిక తాండ్రపాపారాయ జంక్షన్‌లో రోటరీక్లబ్, కారుణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. హరిత దీపావళిని జరుపుకోవాలని నినదించారు. కార్యక్రమం లో రోటరీ క్లబ్ కార్యదర్శి జేసీ రాజు, రీజనల్ చైర్ కాసలదేవి చంద్ర కిశోర్, ఎస్‌వి రమణమూర్తి, గెంబలి శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలి రూరల్: దీపాలతోనే దీపావళి చేసుకోవాలని నారాయణప్పవలస పాఠశాల హెచ్‌ఎం జేసీ రాజు తెలిపారు. నారాయణప్పవలస ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు హరిత దీపావళిపై అవగాహన కల్పించారు. కాలుష్యాన్ని వెదజల్లే మతా బులకు స్వస్తిపలకాలని సూచించారు. చీపురుపల్లి: హరిత దీపావళిని జరుపుకోవాలని ఎస్‌ఐ దుర్గాప్రసాద్ సూచించారు. మావవీయత సంస్థ ఆధ్వర్యంలో బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా నేపథ్యంలో పాఠశాల విద్యార్థులు అప్రమ త్తంగా మెలగాలన్నారు. బాణాసంచా కారణంగా వైరస్ ప్రబలే అవకాశా లున్నందున ప్రతి ఒక్కరూ ఈ ఏడాది హరిత దీపావళిని జరుపుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వడ్డాది అప్పారావు, మానవీయత సంస్థ అధ్యక్షుడు బీవీ గోవిందరాజులు, ఉపాధ్యాయులు పి.వెంకటరావు, ఎస్. రమేష్‌నాయుడు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. వేపాడ: మండల ప్రజలు దీపావళి పండగను సంప్రదాయబద్ధంగా చేసుకోవాలని వల్లంపూడి ఎస్‌ఐ లోవరాజు అన్నారు. కరోనా కారణంగా ఊపిరితిత్తులకు అనారోగ్యం కల్పించే మందుగుండు సామగ్రి కాల్చరాదన్నారు. అనుమతి లేకుండా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గరుగుబిల్లి: ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో గ్రీన్ దీపావళిని జరుపుకోవాలని తహసీల్దార్ వీవీఎస్ శర్మ తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలన్నారు. బాంబులు పేల్చడం నిషేధమన్నారు. శానిటైజర్లు రాసుకోకుండా దీపావళి సామగ్రి కాల్చాలన్నారు. నెల్లిమర్ల: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రీన్ దీపావళిని జరుపుకోవాలని నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్ జె.రామప్పలనాయుడు అన్నారు. హానికరమైన క్రాకర్స్ కాల్చవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
Updated Date - 2020-11-14T04:27:51+05:30 IST