ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచారయత్నం కేసులో ఆటో డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు

ABN, First Publish Date - 2020-12-03T05:21:34+05:30

అత్యాచారయత్నం కేసులో ఓ ఆటోడ్రైవర్‌కు ఏడేళ్ల జైలు, రూ.45 వేలు జరిమానా విధిస్తూ విజయనగరం ఒకటో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయ మూర్తి కె.సుధామణి తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం కొత్తవలస సీఐ జి.గోవిందరావు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తవలస : అత్యాచారయత్నం కేసులో ఓ ఆటోడ్రైవర్‌కు ఏడేళ్ల జైలు, రూ.45 వేలు జరిమానా విధిస్తూ విజయనగరం ఒకటో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయ మూర్తి కె.సుధామణి తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం కొత్తవలస సీఐ జి.గోవిందరావు  తెలియజేశారు. 2016 డిసెంబరు 27న మండలంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న బాలిక కొత్తవలసలో ఆటో ఎక్కి ఇంటికి బయల్దేరింది. ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత ముసిరాం-కళ్లేపల్లి గ్రామాల మధ్యలో ఆ బాలికపై లక్కవరపుకోట మండలం, లచ్చంపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ కాకర వీరాస్వామి అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో ఆ బాలిక ప్రతిఘటించి ఇంటికి చేరింది. విషయం తెలుసుకున్న తల్లిదం డ్రులు కొత్తవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పటి సీఐ జి.సంజీవరావు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... వీరాస్వామిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి విజ యనగరం జిల్లా కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయగా... ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు సీఐ గోవిందరావు తెలిపారు. స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసెక్యూటర్‌ కొండపల్లి సూర్యప్రకాష్‌ బాలిక తరఫున వాదించారు. 

 

Updated Date - 2020-12-03T05:21:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising