కదంతొక్కిన ఆశాలు
ABN, First Publish Date - 2020-11-03T05:46:15+05:30
ఆశా కార్యకర్తలను సచివాలయాల పరిదిలోకి తీసుకెళ్లొదని డిమాండ్ చేస్తూ వారంతా కదంతొక్కారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళనకు దిగారు.
సచివాలయాలకు అప్పగించొద్దని డిమాండ్
కలెక్టరేట్ వద్ద నిరసన
కలెక్టరేట్, నవంబరు 2:
ఆశా కార్యకర్తలను సచివాలయాల పరిదిలోకి తీసుకెళ్లొదని డిమాండ్ చేస్తూ వారంతా కదంతొక్కారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఆశా కార్యకర్తల సంఘం నాయకురాలు సుధారాణి మాట్లాడుతూ సచివాలయాల వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఉండాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... పట్టణాల్లో అధికారులు సహకరించకపోగా బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఆశాలకు రూ.10వేల వేతనం ప్రకటించి అర్ధాంతరంగా వయసును కుదించడం సరికాదన్నారు. ఆశా వర్కర్లు 14 సంవత్సరా లుగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగానికి గ్యారంటీ లేదన్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆశా వర్కర్ల ఆందోళన విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో రమణకుమారి అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.
Updated Date - 2020-11-03T05:46:15+05:30 IST