ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోయిన డబ్బులు తిరిగొచ్చాయ్‌..

ABN, First Publish Date - 2020-07-08T23:04:24+05:30

ఇటీవల సైబర్‌ నేరగాళ్ల చేతివాటంతో సుమారు 2లక్షల పదివేల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సైబర్‌ నేరగాళ్ల నుంచి బాధితుని అకౌంట్‌కు బదిలీ 


కొత్తవలస(విజయనగరం): ఇటీవల సైబర్‌ నేరగాళ్ల చేతివాటంతో సుమారు 2లక్షల పదివేల రూపాయలు తుమ్మికాపల్లి గ్రామస్థుడి అకౌంట్‌నుంచి చోరీ అయిన విషయం విధితమే. ఈ ఘటన అనంతరం సైబర్‌ నేరగాళ్లు దోచుకున్న మొత్తంలో సుమారు లక్షా నలబై వేల రూపాయలు బాధితుని అకౌంట్‌లో తిరిగి జమ అయినట్టు బ్యాంకు అధికారులు మంగళవారం తెలిపారు. ఇందుకు సంబంధించి బాధితుడు పూడి భాస్కరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత శుక్రవారం దుర్గాదేవి ఆలయానికి సంబంధించి కరెంట్‌ బిల్లు చెల్లించడానికి పూడి భాస్కరరావు తన అకౌంట్‌ నుంచి 1500 రూపాయలు గూగుల్‌ పే ద్వారా చెల్లించాడు.


బిల్లు చెల్లించినట్టు మెసేజ్‌ రాక  పోవడంతో గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేయగా వెంటనే గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ పేరుతో భాస్కరరావుకు ఫోన్‌ వచ్చింది. అకౌంట్‌కు సంబంధించి యూపీఏ నంబరు నమోదు చేయాలని ఫోన్‌లో సూచించడంతో యూపీఏ నెంబరు నమోదు చేసిన కొద్ది క్షణాల్లో నాలుగుసార్లు 48 వేల 950 రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతానుంచి, పేటీఎం ద్వారా 1500 రూపాయలు, 9 వేల 999 రూపాయలు కట్‌ అయిపోవడంతో భాస్కరరావు బ్యాంక్‌ను ఆశ్రయించి అకౌంట్‌ను బ్లాక్‌ చేయించుకున్నాడు.


సైబర్‌ నేరగాళ్లు ఈ సొమ్మును డ్రా చేసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. నేరగాళ్లు తమ అకౌంట్‌కు డబ్బులు మళ్లించుకునే సమయంలో నెట్‌ పని చేయకపోవడంతో ఆ సొమ్ము మూడుసార్లు తిరిగి బాధితుని అకౌంట్‌లోనే జమయ్యింది. 48 వేల 950 రూపాయలు, పేటీఎం ద్వారా 1500 రూపాయలు, 9 వేల 999 రూపాయలు మాత్రం సైబర్‌ నేరగాళ్లు అకౌంట్‌కు బదిలీ అయ్యాయి. ్లడబ్బులు మళ్లించే సమయంలో నెట్‌ పని చేయక పోవడం వలనే కట్‌ అయిన డబ్బులు తిరిగి జమ అయినట్టు బ్యాంక్‌ అధికారులు భాస్కరరావుకు తెలిపారు. 

Updated Date - 2020-07-08T23:04:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising