ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చురుగ్గా క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు

ABN, First Publish Date - 2020-03-27T11:31:40+05:30

కురుపాంలో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అవసరమైతే కురు పాంలో 100

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురుపాం,మార్చి26: కురుపాంలో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు కు అధికారులు  సన్నాహాలు చేస్తున్నారు. అవసరమైతే  కురు పాంలో 100 పడకలతో  కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా  స్థానిక గిరిజన సక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల, పాత లెప్రసీ ఆసుపత్రి భవనం, జూనియర్‌ కళాశాల, పోస్టు మెట్రిక్‌ బాలురు వసతి గృహం, గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలను పరీశీలించి ప్రతిపాదించారు. గురువారం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశా లలో గదులను  శుభ్రం చేయించారు. ఈ  పరిశీలనలో ఎంపీడీవో మురళీకృష్ణ,హెచ్‌డీటీ రమణారావు, పాల్గొన్నారు.


ఉద్యాన కళాశాలలో బెడ్లు సిద్ధం

గరుగుబిల్లి : ఉల్లిభద్ర సమీపంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన కళాశాలలో అవసరమైన బెడ్లును అధికారులు సిద్ధం చేశారు. గురు వారం తహసీల్దార్‌ వీవీ సన్యాసిశర్మ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ జి.శ్రీనివా సరావు, పలువురు వీఆర్‌వోలు  ప్రత్యేక చర్యలు చేపట్టారు.  100 పడకల క్వారంటైన్‌ కేంద్రానికి కళాశాల అనువుగా ఉందని వారు తెలిపారు. పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించనున్నామని కళాశాల అసోసియేషన్‌ డీన్‌ డాక్టర్‌ బి.ప్రసన్నకుమార్‌ తెలిపారు.  అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పారు.

Updated Date - 2020-03-27T11:31:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising