అభివృద్ధి పనులు వేగవంతం
ABN, First Publish Date - 2020-12-12T05:05:23+05:30
మండలంలో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వైసీపీ జిల్లా వ్యవహారాల సమన్వ యకర్త మజ్జి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో కలిసి ఆయన అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు.
చీపురుపల్లి: మండలంలో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వైసీపీ జిల్లా వ్యవహారాల సమన్వ యకర్త మజ్జి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో కలిసి ఆయన అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. మండలంలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏయా గ్రామాల్లో అడ్డంకులున్నాయో గుర్తించి వాటిని సరిచేయాలన్నారు. స్థల సేకరణ కోసం ఆయా గ్రామాల పెద్దల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరు నాటికి అంతా సిద్ధం చేయాలన్నారు. సచివాలయ భవనాలు, వెల్‌నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. పూర్తయిన పనుల బిల్లు చెల్లింపులకు మార్గం సుగమం చేయాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్ల సేవల్ని సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. సమావేశంలో పార్టీ నేతలు శ్రీనివాసరావునాయుడు, అనంతం, నాఫెడ్ మాజీ డైరెక్టర్ సూర్యనారాయణరాజు, నాయకులు పాపినాయుడు, జనార్దన, గురునాయుడు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
సచివాలయ నిర్మాణానికి భూమి పూజ
పర్లలో నిర్మించనున్న సచివాలయ భవనానికి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైసీపీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని 18 సచివాలయ భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. పార్టీ నాయకులు మంత్రి రమణ మూర్తి, రాము, ఎంపీడీవో రామకృష్ణరాజు, తహసీల్దార్ పీవీ శ్యామసుందరావు, డీఈ శ్రీనివాసరావు, జేఈఈ డీ. రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T05:05:23+05:30 IST