ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాలకు స్థల పరిశీలన

ABN, First Publish Date - 2020-06-04T09:29:26+05:30

కురుపాం సమీపంలో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయనున్న స్థలాన్ని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, జేఎన్‌టీయూ బృందం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురుపాం, జూన్‌ 3: కురుపాం సమీపంలో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయనున్న స్థలాన్ని   కలెక్టర్‌  హరిజవహర్‌లాల్‌, జేఎన్‌టీయూ బృందం పరిశీలించారు. బుధవారం సాయంత్రం కురుపాం సమీపంలో టేకరిఖండిలో ఉన్న 105 ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్‌, జేఎన్‌టీయూ బృందం,  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు శతృచర్ల పరీక్షత్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అడ్వాన్స్‌గా ఈ స్థలంలో భవనాలు నిర్మించడానికి జేఎన్‌టీయూ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఎం.రామలింగరాజు, జేఎన్‌టీయూ రిజిస్ర్టార్‌ సీహెచ్‌ సత్యనారాయణకు 105 ఎకరాల స్థలం ప్రొసీడింగ్స్‌ను కలెక్టర్‌ అందజేశారు.


అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్డు పక్కనే అనువైన స్థలం లభించిందని, ఈ స్థలంలో మంచి భవనాలు నిర్మించి కళాశాల ఏర్పాటు చేసుకోవాలని    కళాశాల  బృందాన్ని కోరారు. కార్యక్రమంలో జేన్‌టీయూ ఇంజినీరింగ్‌ బృందం సభ్యులు ప్రొఫెసర్‌ జి.ఏసురత్నం, ఓఎస్‌డీ రవీంద్రనాథ్‌, వీసీ ప్రొఫెసర్‌ స్వామినాయడు, విజయనగరం ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జయసుమ, తహసీల్దార్‌ ఎల్లారావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-06-04T09:29:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising