నాడు-నేడు పనులపై సమీక్ష
ABN, First Publish Date - 2020-12-30T06:01:48+05:30
బొబ్బిలి మునిసిపల్, మండలపరిషత్ పరిధిలో 43 పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పను లపై జిల్లా అధికారులు మంగళవారం సాయంత్రం వీడి యోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
బొబ్బిలి: బొబ్బిలి మునిసిపల్, మండలపరిషత్ పరిధిలో 43 పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పను లపై జిల్లా అధికారులు మంగళవారం సాయంత్రం వీడి యోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మునిసిపల్ కార్యాలయంలో ఎంఈవో లక్ష్మణరావు మాట్లాడుతూ.. 43 పాఠశాలలకు రూ.9.80 కోట్లు మంజూరు కాగా, రూ.5.60 కోట్ల రివాల్వింగ్ ఫండ్ విడుదలైందని తెలిపారు. అందులో రూ.5.15 కోట్లు ఖర్చయినట్లు చెప్పారు. మిగిలిన రూ.45 లక్షలను వచ్చే నెల 10 లోగా ఖర్చుచేయాలని జేసీ మహేష్ కుమార్, డీఈవో నాగమణి ఆదేశించారు. టాయి లెట్స్, తాగునీటి సదుపాయం, విద్యుదీకరణ తదితర పనులన్నింటినీ పూర్తి చేయాలని నిర్దేశించారు. సమా వేశంలో హెచ్‌ఎంలు, సీఆర్‌పీలు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T06:01:48+05:30 IST