విజయనగరం : హైస్కూల్‌లో 9 మంది విద్యార్థులకు కరోనా
ABN, First Publish Date - 2020-10-04T01:22:50+05:30
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోందనిపిస్తోంది.
విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోందనిపిస్తోంది. తాజాగా.. విజయనగరం జిల్లాలోని దత్తిరాజేరు మండలం దత్తి జెడ్పీ హైస్కూల్‌లో 09 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఓ ఉపాధ్యాయుడికి కూడా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్యాధికారులు వెంటనే ఇద్దర్ని హోమ్ ఐసోలేషన్‌కు మిగిలిన వారిని జేఎన్టీయూ కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయంపై ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.
Updated Date - 2020-10-04T01:22:50+05:30 IST