ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు @ 40

ABN, First Publish Date - 2020-05-31T11:10:21+05:30

ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు చేసుకుంటామంటే ఇక కుదరదు. పరిమిత సంఖ్యలో విద్యార్థుల చేరిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయివేటు కళాశాలల్లో ప్రవేశాలపై ఆంక్షలు

 సెక్షన్‌కు 40 మందికే పరిమితం  

 ప్రభుత్వం ఉత్తర్వులు

ఇలాగైతే కష్టమేనంటున్న యాజమాన్యాలు


(పార్వతీపురం)

ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు చేసుకుంటామంటే ఇక కుదరదు. పరిమిత సంఖ్యలో విద్యార్థుల చేరిక ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. సెక్షన్‌కు 40 మంది మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. తొమ్మిది సెక్షన్లకు మించకుండా కాలేజీ నిర్వహించాలని పేర్కొంది. ఈ లెక్కన ఒక కళాశాలలో 360 మంది విద్యార్థులు ఉండేలా చూడాలని సూచించింది. ఈ పరిస్థితుల్లో కాలేజీల నిర్వహణ కష్టమని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకూ సెక్షన్‌కు 88 మంది విద్యార్థులు ఉండేవారు. తాజా ప్రభుత్వ ఆదేశాలతో 48 మంది తగ్గనున్నారు. సగానికి పైగా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టనుంది. 8 వేల చదరపు అడుగుల నిడివి కలిగిన కళాశాలల్లో 160 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. ఒక్కొక్క సెక్షన్‌కు 2 వేల చదరపు అడుగుల గది ఉండాలి. గతంలో 8 వేల చదరపు అడుగుల నిడివి ఉండే కాలేజీల్లో 352 మంది విద్యార్థులు చదువుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు.


జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో ప్రస్తుతం 72 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో సుమారు 30 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఇందులో సగం మంది విద్యార్థులకే పరిమితం కానున్నారు. పిల్లల చదువుకు తల్లిదండ్రులు ప్రాధాన్యమిస్తున్నారు. వారి భవిష్యత్‌ దృష్ట్యా తమ ఆర్థిక పరిస్థితికి మించి చదువులకు ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లు తగ్గుతున్న నేపథ్యంలో.... కార్పొరేట్‌ కాలేజీల్లో ప్రవేశాలకు పోటీ నెలకొనే అవకాశం ఉంది. విద్యార్థులను తగ్గించడంతో అధ్యాపకులపై వేటు పడనుంది. జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువత కాలేజీల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. విద్యార్థులు తగ్గుతున్న దృష్ట్యా వీరినీ యాజమాన్యాలు తగ్గించే అవకాశం ఉంది. ఇన్ని ఆంక్షల నడుమ కాలేజీల నిర్వహణ కత్తిమీద సామేనని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 


కాలేజీలు నిర్వహించలేం

ప్రభుత్వ కొత్త నిబంధనలతో కాలేజీలు నిర్వహించలేం. సెక్షన్‌కు 40 మంది విద్యార్థులే ఉండాలన్న నిబంధన సరికాదు. అద్దె భవనాల్లో కాలేజీ నిర్వహిస్తున్న వారికి ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వం పునరాలోచించాలి. 

 వెంకటేశ్వరరావు, అధ్యక్షులు, జిల్లా ప్రైవేటు జూనియర్‌ కళాశాలల సంఘం

Updated Date - 2020-05-31T11:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising