ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో రౌడీషీటర్ బర్త్ డే పార్టీ.. అట్టర్ ప్లాప్ చేసిన పోలీసులు

ABN, First Publish Date - 2020-06-07T16:55:11+05:30

సినిమాల్లో డాన్‌లు, రౌడీషీటర్లు తమ డెన్‌లలో బర్త్ డే పార్టీలు చేసుకుంటుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: సినిమాల్లో డాన్‌లు, రౌడీషీటర్లు తమ డెన్‌లలో బర్త్ డే పార్టీలు చేసుకుంటుంటారు. అక్కడ ఉండే హంగామా అంతా ఇంతా ఉండదు. మందు పార్టీ, డీజే పాటలు, అమ్మాయిలు, అబ్బాయిల డ్యాన్సులు, గ్యాంగ్‌లోని సహచరులు ఇలా ఉంటుంది అక్కడి తతంగం. సరిగ్గా ఇలా కాకున్నా... కాస్త అటు, ఇటుగా ఓ రౌడీషీటర్ తన బర్త్ డే సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేశాడు. అయితే పోలీసుల ఎంట్రీతో ఆ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యింది.


వివరాల్లోకి వెళితే... నగరానికి చెందిన రౌడీషీటర్ చిట్టిమాము బర్త్ డే సెలబ్రేషన్స్‌‌ను శనివారం రాత్రి  టాస్క్‌ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు. ఇతను మరో రౌడీ షీటర్ ఖాసీం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సినీ ఫక్కీలో మందీమార్బలంతో, బౌన్సర్లతో పుట్టిన రోజు వేడుకలను ప్లాన్ చేసుకున్నాడు సదరు రౌడీషీటర్. ఈ హంగామా విషయం టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలియడంతో దాడులు జరిపారు. రౌడీషీటర్ చిట్టిమాముతో పాటు పార్టీలో పాల్గొన్న పలువురిని అరెస్ట్ చేశారు. భారీగా లిక్కర్, గంజాయి, లక్ష 50వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను దువ్వాడ పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2020-06-07T16:55:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising