ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్‌అలర్ట్ ప్రాంతంగా విశాఖ నగరం

ABN, First Publish Date - 2020-04-05T00:22:45+05:30

కరోనా ముప్పు ఉన్న జాబితాలోకి విశాఖ నగరం చేరింది. ఇప్పటికే కేంద్రం 29 హాట్ స్పాట్‌లను గుర్తించింది. పెరిగే వైరస్ తీవ్రత దృష్ట్యా 8 రాష్ట్రాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : కరోనా ముప్పు ఉన్న జాబితాలోకి విశాఖ నగరం చేరింది. ఇప్పటికే కేంద్రం 29 హాట్ స్పాట్‌లను గుర్తించింది. పెరిగే వైరస్ తీవ్రత దృష్ట్యా 8 రాష్ట్రాల పరిధిలోని మరికొన్ని జిల్లాలను గుర్తించగా, విశాఖ ఆ జాబితాలో చేరింది. దీంతో రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ప్రీతి సూడాన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధితో తెలిపారు. ఇదే జాబితాలోకి బిహార్‌లోని ముంగేర్, చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, ఢిల్లీలోని న్యూఢిల్లీ, హరియాణాలోని ఫరీదాబాద్, తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలున్నాయని తెలిపారు.


ఇవన్నీ పెరగడానికి ఢిల్లీ లింకులే కారణమని పేర్కొంటున్నారు. ఏపీలో కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో వ్యాప్తి చెందుతోంది. బుధవారం ఇద్దరికి, గురువారం 21 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. శుక్రవారం మరో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. 

Updated Date - 2020-04-05T00:22:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising