ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి వైఎస్సార్‌ చేయూత

ABN, First Publish Date - 2020-08-12T10:06:47+05:30

నేటి నుంచి వైఎస్సార్‌ చేయూత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 1.87లక్షల మంది మహిళలకు సాయం

ఖాతాల్లో రూ.18,750 జమ


విశాఖపట్నం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి):  జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద రూ.18,750 సాయం అందజేత కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమవుతుందని డీఆర్‌డీఎ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.విశ్వేశ్వరరావు తెలిపారు. జిల్లాలో 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన 1,87,959 మంది మహిళల ఖాతాలకు రూ.352 కోట్లు జమ అవుతాయన్నారు. వీరిలో ఎస్సీలు 17,540 మంది, ఎస్టీలు 20,250, బీసీలు 1,40,101, మైనారిటీ మహిళలు 4,068 ఉన్నారన్నారు.


ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో వీరికి రూ.1409.69 కోట్లు అందుతాయన్నారు. నాలుగేళ్ల సొమ్ము ఒకేసారి కావాలనుకునే మహిళలకు తొలి ఏడాది రూ.18,750 పోనూ, మిగిలిన రూ.56,250 బ్యాంకుల ద్వారా రుణంగా ఇప్పిస్తామన్నారు. ఇప్పటికే తీసుకున్న బ్యాంకు లింకేజీకి ఈ రుణం అదనమని పేర్కొన్నారు. గత ఏడాది స్వయం సేవక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.1103.75 కోట్లు రుణాలుగా మంజూరుచేశామన్నారు. గత ఏడాది మంజూరైన రుణాలు ఏ మేరకు సద్వినియోగం అవుతున్నాయనేది తెలుసుకుని లోటుపాట్లు సవరించడానికి జిల్లాలో 750 సంఘాల పనితీరుపై సర్వే చేశామన్నారు. 

Updated Date - 2020-08-12T10:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising