ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాల భవనానికి వైసీపీ రంగులు!

ABN, First Publish Date - 2020-05-01T18:22:12+05:30

ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ రంగులను తొలగించాలని కోర్టులు ఆదేశించిన తరువాత కూడా పాలకుల తీరు మారడంలేదు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సొంతంగా వేయించిన స్థానిక నేత

తెలియదంటున్న విద్యా శాఖ అధికారులు


అచ్యుతాపురం (విశాఖపట్టణం): ప్రభుత్వ భవనాలకు వేసిన పార్టీ రంగులను తొలగించాలని కోర్టులు ఆదేశించిన తరువాత కూడా పాలకుల తీరు మారడంలేదు. ప్రభుత్వ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేస్తున్నారు. అచ్యుతాపురం మండల ఇరువాడలో ఏకంగా పాఠశాల భవనానికే వైసీపీ జెండాలోని రంగులు వేశారు.  ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాలకు రెండు భవనాలు వున్నాయి. ఒకటి శిథిలావస్థకు చేరడంతో ఏడాది క్రితం బాగు చేయించారు. కానీ విద్యార్థులు తక్కువ మంది వుండడంతో ఒక భవనంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన స్థానిక నేత ఒకరు ఈ భవనానికి వైసీపీ జెండాలోని రంగులు వేయించారు. పాఠశాల భవనానికి పార్టీ రంగులు వేయడంపై ఆరా తీయగా, గ్రామ సచివాలయానికి వినియోగిస్తామని సదరు నేత చెప్పారు. దీనిపై ఎంఈవో దేవరాయలను వివరణ కోరగా, పాఠశాల భవనానికి పార్టీ రంగులు వేసినట్టు తనకు తెలియదని, విచారించి ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు.


రైతు భరోసా కేంద్రానికి..

చింతపల్లి మండలంలోని తాజంగి రైతు భరోసా కేంద్రం భవనానికి వైసీపీ రంగులు వేస్తున్నారు. దీనిపై మండలం  గిరిజన సంఘం జిల్లా ఉపాఽధ్యక్షుడు పాంగి ధనుంజయ... స్థానిక అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రంగులు వేయిస్తున్నామని వారు చెప్పారు.

Updated Date - 2020-05-01T18:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising