ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి లేదు..కూలీల ఆకలి కేకలు

ABN, First Publish Date - 2020-03-27T09:52:22+05:30

జాతీయ ఉపాధి హామీ పథకం కింద మట్టి పనులు చేస్తున్న కూలీలకు ఆరు వారాల నుంచి కూలి డబ్బులు అందడం లేదు. దీంతో వ్ర ఆర్థిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరు వారాల నుంచి ఆగిన చెల్లింపులు

రూ.38.45 కోట్లకు చేరిన బకాయిలు

పనులు ఆపేసిన అధికారులు

లాక్‌డౌన్‌తో మరిన్ని ఇబ్బందులు

ఏప్రిల్‌ మొదటి వారంలో చెల్లింపులంటున్న అధికారులు


అనకాపల్లి, మార్చి 26:

జాతీయ ఉపాధి హామీ పథకం కింద మట్టి పనులు చేస్తున్న  కూలీలకు ఆరు వారాల నుంచి కూలి డబ్బులు అందడం లేదు. దీంతో వ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో గత ఆదివారం నుంచి డ్వామా అధికారులు పనులు ఆపేయడం, చేతిలో డబ్బులు లేకపోవడం, లాక్‌ డౌన్‌ కారణంగా ఇతరత్రా పనులు కూడా ఆగిపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్టు కూలీలు వాపోతున్నారు. 


జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 4,73,846 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. వీరికి ఆరు వారాల నుంచి కూలి డబ్బులు అందడం లేదు. గత నెల రెండో వారంలో డబ్బులు అందాయని కూలీలు చెబుతుండగా, గత నెల 26వ తేదీ వరకు చెల్లింపులు జరిపినట్టు అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 21వ తేదీ వరకు పనులు చేసిన కూలీలకు 38 కోట్ల 45 లక్షల 81 వేల 157 రూపాయలు చెల్లించాల్సి ఉంది. డుంబ్రిగుడ మండలంలోని కూలీలకు అత్యధికంగా రూ.2,36,13,714 బకాయిలు ఉన్నాయి. 16 మండలాల్లో కోటి రూపాయలపైబడి చెల్లించాల్సి ఉంది. కూలి డబ్బులు వెంటనే చెల్లించేలా ఉన్నతాధికారులు చూడాలని ఉపాధి కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఉపాధి కూలీలకు ఏప్రిల్‌ మొదటి వారంలో చెల్లింపులు జరుగుతాయని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ సందీప్‌ తెలిపారు.


మండలాల వారీగా కూలీలు, అందాల్సిన సొమ్ము 

మండలం    కూలీలు బకాయి సొమ్ము

అనకాపల్లి 15,673 రూ.1,36,79,755

ఆనందపురం 13,100 రూ.1,02,79,775

అనంతగిరి 7,118 రూ.75,51,690

అరకులోయ 12,878 రూ.1,30,08,794

అచ్యుతాపురం 3,459 రూ.25,10,232

భీమునిపట్నం 7,518 రూ.57,48,840

బుచ్చెయ్యపేట 15,116 రూ.1,07,28,669

చీడికాడ 8,509 రూ.65,47,977

చింతపల్లి 18,434 రూ.1,79,26,227

చోడవరం 9,006 రూ.64,84,379

దేవరాపల్లి 8,905 రూ.60,17,229

డుంబ్రిగుడ 23,021 రూ.2,36,13,714

జి.మాడుగుల 7,805 రూ.73,06,444

గొలుగొండ 15,848 రూ.1,52,30,071

గూడెంకొత్తవీధి 4,658 రూ.38,24,087

హుకుంపేట 7,600 రూ.70,84,893

కె.కోటపాడు 12,251 రూ.91,93,410

కశింకోట 9,435 రూ.60,98,667

కోటవురట్ల 17,181 రూ.1,04,29,151

కొయ్యూరు 10,554 రూ.1,01,62,906

మాడుగుల 12,659 రూ94,30,242

మాకవరపాలెం 22,248 రూ.1,66,72,617

మునగపాక 10,257 రూ.72,42,981

ముంచింగిపుట్టు 15,800 రూ.1,77,69,286

నక్కపల్లి 18,364 రూ.1,62,54,114

నర్సీపట్నం 9,258 రూ.67,83,875

నాతవరం 15,700 రూ.1,13,07,603

పాడేరు 10,402 రూ.1,04,69,288

పద్మనాభం 13,488 రూ.88,62,292

పరవాడ 2,997 రూ.26,24,907

పాయకరావుపేట 5,814 రూ.34,06,900

పెదబయలు 16,709 రూ.1,91,26,341

పెందుర్తి 5,967 రూ.40,70,931

రాంబిల్లి 10,380 రూ.65,77,039

రావికమతం 21,183 రూ.1,24,64,701

రోలుగుంట 20,451 రూ.1,37,19,518

ఎస్‌.రాయవరం 14,271 రూ.96,07,530

సబ్బవరం 11,944 రూ.92,97,362

ఎలమంచిలి 7,885 రూ.54,66,720

మొత్తం 4,73,846 రూ.38,45,81,157


రూ.6 వేలు అందాలి...దేవర లక్ష్మి, ఉపాధి కూలి, మునగపాక

ఆరు వారాల నుంచి ఉపాధి కూలి సొమ్ము అందలేదు. నాకు సుమారు ఆరు వేల రూపాయలు రావాల్సి ఉంది. జనవరి ఒకటో వారంలో బడ్జెట్‌ విడుదల అయ్యింది. ఫిబ్రవరి మొదటి వారంలో బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకున్నాను. మళ్లీ ఇంతవరకు కూలి డబ్బులు అందలేదు.


బకాయిలు వెంటనే ఇవ్వాలి..శీరా రమణ, మారేడుపూడి, అనకాపల్లి మండలం

కరోనా వైరస్‌ కారణంగా గత ఆదివారం నుంచి పనులు ఆపేశారు. ఉపాధి పనుల కూలి డబ్బులు చేస్తే ఇంటి ఖర్చులకు ఉపయోగపడతాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే మరో నెల రోజుల వరకు ఉపాధి పనులు జరగవనిపిస్తున్నది. బయట కూడా కూలి పనులు లేవు. అధికారులు స్పందించి  కూలి బకాయిలు ఇప్పించాలి. 

Updated Date - 2020-03-27T09:52:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising