ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్య హత్య

ABN, First Publish Date - 2020-08-22T11:28:10+05:30

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. పట్టణ శివారు తోటాడకు వెళ్లే మార్గంలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కడతేర్చిన భర్త


అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 21: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. పట్టణ శివారు తోటాడకు వెళ్లే మార్గంలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు అందించిన వివరాలిలా వున్నాయి. తోటాడ మార్గంలో యిళ్ల వీరునాయుడు, సన్యాసమ్మ దంపతులు కల్లు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మొదటి భార్యతో సంబంధాలు విడిచి, రెండో భార్య సన్యాసమ్మ (49)తో వీరునాయుడు కలిసి వుంటున్నాడు.


గురువారం రాత్రి మద్యం కోసం డబ్బులు అడగ్గా, తన వద్ద లేవని సన్యాసమ్మ చెప్పింది. దీనికి కోపోద్రోక్తుడైన వీరునాయుడు ఆమె తలను గోడకేసి కొట్టడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం ఉదయం విజయరామరాజుపేటలో వుంటున్న కుమారుడు శ్రీనివాసరావుకు తల్లి చనిపోయినట్టు చెప్పాడు. ఆయన వెళ్లి తల్లి మృతదేహం వద్ద భోరున విలపించాడు. శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు నిందితుడు వీరునాయుడును అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ తెలిపారు.

Updated Date - 2020-08-22T11:28:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising