ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక రైళ్లు ఏవీ?

ABN, First Publish Date - 2020-12-28T05:38:35+05:30

సంక్రాంతి దగ్గర పడుతోంది. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, హౌరా, విజయవాడల నుంచి వేలాది మంది విశాఖపట్నం, పరిసర ప్రాంతాలకు వస్తారు. అలాగే ఇటు నుంచి అటు వెళతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్రాంతి దగ్గరపడుతున్నా ఉలుకూపలుకు లేని అధికారులు

ప్రస్తుతం నడుస్తున్న రైళ్లన్నీ ఆ వారం రోజులూ ఫుల్‌

మరికొన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికుల డిమాండ్‌ 

ఇప్పుడు నడుస్తున్న రైళ్లే పూర్తి ఆక్యుపెన్సీ లేదని అధికారుల వాదన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సంక్రాంతి దగ్గర పడుతోంది. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, హౌరా, విజయవాడల నుంచి వేలాది మంది విశాఖపట్నం, పరిసర ప్రాంతాలకు వస్తారు. అలాగే ఇటు నుంచి అటు వెళతారు. అటువంటివారు ముందుగా రిజర్వేషన్‌ చేయించుకుందామంటే... సంకాంత్రికి ముందు మూడు రోజులు, తరువాత మూడు రోజులు ఖాళీలేవు. దీంతో కొత్తగా సంక్రాంతి స్పెషల్స్‌ ఏమైనా వేస్తారా? అని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే అధికారులేమో...‘ప్రస్తుతం ఉన్న రైళ్లే పూర్తి ఆక్యుపెన్సీతో నడవడం లేదు. కొత్తవి ఎలా ప్రతిపాదిస్తాం’ అనే ఆలోచనతో ఉన్నారు.


ఏటా వేసే వారు...ఇప్పుడే..?

విశాఖపట్నం స్టేషన్‌ నుంచి కరోనాకు ముందు రోజుకు 112 రైళ్లు నడిస్తే... 70 వేల మంది రాకపోకలు సాగించేవారు. అదే సంకాంత్రి సమయంలో అయితే లక్ష మంది వరకు వచ్చేవారు. హైదరాబాద్‌, చెన్నై, హౌరా, బెంగళూరు, శ్రీకాకుళం, విజయవాడలకు ప్రత్యేక రైళ్లు అదనంగా నడిపేవారు. ఇప్పుడు రెగ్యులర్‌ రైళ్లే పూర్తిగా నడవడం లేదు. హైదరాబాద్‌కు గోదావరి, విశాఖ, గరీభ్‌రథ్‌, దురంతో, జన్మభూమి, ఈస్ట్‌కోస్ట్‌ రైళ్లు రెగ్యులర్‌గా నడిచేవి. అన్నింటిలోనూ జనాలు కిక్కిరిసి ఉండేవారు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో కేవలం రెండు ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. అలాగే బెంగళూరుకు చూసుకుంటే ప్రశాంతి, యశ్వంత్‌పూర్‌ రెగ్యులర్‌గా నడిచేవి. ఇప్పుడు రెండింటిలో ఒక్కదాన్ని వారానికి ఒకసారే నడుపుతున్నారు. దీనిని రెగ్యులర్‌ చేస్తే కొంత ప్రయోజనం వుంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. చెన్నైకి రెండు రైళ్లు నడిచేవి. అందులో ఒక్కటే ప్రస్తుతం నడుస్తోంది. హౌరాకు మెయిల్‌, కోరమండల్‌, షాలీమార్‌, యశ్వంత్‌పూర్‌ నడిచేవి. ఇందులో ఒక్కటే వారానికి మూడు రోజులు నడుస్తోంది. మరొక రైలును వారానికి రెండుసార్లు నడుపుతున్నారు. 


ప్రస్తుతం ఎలాగంటే...

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో విశాఖపట్నం మీదుగా 112 రైళ్లకు బదులు 36 రైళ్లే నడుస్తున్నాయి. అందులో ఆరు రైళ్లు 60 శాతం ఆక్యుపెన్సీతో ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాయి. నిర్వహణ వ్యయంతో పోల్చుకుంటే చార్జీల ద్వారా వచ్చే మొత్తం చాలా తక్కువ. అయితే వీటన్నింటినీ పక్కన పెట్టి హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, చెన్నైలకు ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. సంకాంత్రికి ఇంకా కొంత సమయం ఉన్నందున, ముందుగా వాటిని ప్రకటించి.. డిమాండ్‌ ఉంటేనే నడుపుతామని, లేదంటే రద్దు చేస్తామనే నిబంధనతో అయినా నడపాలని సూచిస్తున్నారు.


ఏదైనా జనవరి 10 తరువాతే...

ప్రస్తుతం రాజమహేంద్రవరం వైపు రైల్వే లైన్ల ఆధునికీకరణలో భాగంటా నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఇవి జనవరి 10 వరకు కొనసాగుతాయి. ఈ పనుల నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే కొన్ని రైళ్లను దారిమళ్లిస్తూ, మరికొన్నింటిని రద్దు చేస్తున్నారు. అందువల్ల ఆ మార్గంలో పదో తేదీ వరకు కొత్తగా అదనపు రైళ్లు నడిచే అవకాశం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే సంక్రాంతికి వచ్చేవారు పదో తేదీ తరువాతే ఎక్కువ మంది బయలుదేరతారు కాబట్టి ప్రత్యేక రైళ్లు వేయాలనే అత్యధికులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-28T05:38:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising