ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థుల్లో పఠన నైపుణ్యత పెంపునకు కృషి

ABN, First Publish Date - 2020-11-27T06:04:26+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పఠన నైపుణ్యత పెంచేందుకు మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల కోసం ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమాన్ని విద్యా శాఖ రూపొందించినట్టు ట్రైనింగ్స్‌ అండ్‌ ఓపెన్‌ స్కూళ్ల రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు.

నక్కపల్లి బాలికోన్నత పాఠశాలలో మాట్లా డుతున్న జేడీ శ్రీనివాసరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ‘చదవడం మాకిష్టం’ ఇందులో భాగమే

  ట్రైనింగ్స్‌, ఓపెన్‌ స్కూళ్ల రాష్ట్ర జేడీ శ్రీనివాసరెడ్డి

నక్కపల్లి/ పాయకరావుపేట,  నవంబరు 26 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పఠన నైపుణ్యత పెంచేందుకు మూడు నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల కోసం ‘చదవడం మాకిష్టం’  కార్యక్రమాన్ని విద్యా శాఖ రూపొందించినట్టు ట్రైనింగ్స్‌ అండ్‌ ఓపెన్‌ స్కూళ్ల రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం నక్కపల్లి బాలికోన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్నిలాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు.  వచ్చే ఏడాది విద్యా సంవత్సరం వరకూ కొనసాగుతుందన్నారు.  ఇందుకు మండల స్థాయి కమిటీలను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంచాయతీ స్థాయిలో కూడా ఏర్పాటు చేసే కమిటీలకు సెక్రటరీ, స్థానిక పాఠశాల హెచ్‌ఎంలు కన్వీనర్లుగా వ్యవహరిస్తారని చెప్పారు. ఎంపీడీవో రమేశ్‌రామన్‌, జిల్లా ఎంఐఎస్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ ఎం.సత్యప్రసాద్‌, ఎంఈవో డీవీడీ ప్రసాద్‌, హెచ్‌ఎంలు  పద్మావతి, పుష్యరాగం పాల్గొన్నారు. అనంతరం జేడీ నక్కపల్లి జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. అలాగే, పాయకరావుపేటలోని వివిధ ఉన్నత పాఠశాలలను ఓపెన్‌ స్కూల్స్‌ రాష్ట్ర జాయిట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి  సందర్శించి జగనన్న విద్యా కానుక పంపిణీ తదితర అంశాలను పరిశీలించారు. ఎంఈవో కేఎన్‌గాంధీ, హెచ్‌ఎం నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T06:04:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising