ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతన బకాయిలు చెల్లించాలి

ABN, First Publish Date - 2020-12-12T04:20:42+05:30

ఇప్పటికే బకాయిపడిన ఏడు నెలల వేతనాలు చెల్లించాలని జిల్లాలోని బీసీ హాస్టళ్లలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు.

జీతాలు చెల్లించాలంటూ ధర్నాలో నినాదాలు చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీసీ హాస్టల్‌ అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది ధర్నా 

సిరిపురం, డిసెంబరు 11: ఇప్పటికే బకాయిపడిన ఏడు నెలల వేతనాలు చెల్లించాలని జిల్లాలోని బీసీ హాస్టళ్లలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు. బీసీ హాస్టల్స్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో అధికారుల వైఖరికి నిరసనగా భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు రాజాన దొరబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 జిల్లాల సిబ్బందికి వేతనాలు చెల్లించారని, కేవలం విశాఖ జిల్లాలోనే ఏడు నెలలుగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. తక్షణమే బకాయిలు ెరల్లించకుంటే ఈ నెల 18న ‘చలో అమరావతి’ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సత్యవతి, కాంచన, కోటేశ్వరి, సురేష్‌, గోవింద్‌, ఆదినారాయణ, లోవరాజు, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-12T04:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising