సవరించిన వేళల్లో ప్రత్యేక రైళ్ల రాకపోకలు
ABN, First Publish Date - 2020-12-15T05:58:33+05:30
ప్రయాణికుల సౌకర్యార్ధం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్లు సవరించిన కొత్త వేళల్లో రాకపోకలు సాగిస్తాయని వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు.
విశాఖపట్నం, డిసెంబరు 14: ప్రయాణికుల సౌకర్యార్ధం దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్లు సవరించిన కొత్త వేళల్లో రాకపోకలు సాగిస్తాయని వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే.త్రిపాఠి తెలిపారు.
02889 నంబరు గల రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 6.35 గంటలకు టాటానగర్‌లో బయలుదేరి ఆదివారం ఉదయం 3.45 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 02890 నంబరు గల రైలు ప్రతి సోమవారం ఉదయం 8.30 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మర్నాడు సాయంత్రం 5.25 గంటలకు టాటానగర్ చేరుతుంది.
02887 నంబరు గల రైలు ప్రతి మంగళ, బుధ, గురు, శని, ఆది వారాల్లో ఉదయం 9.20 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు సాయంత్రం 6.05 గంటలకు నిజాముద్దీన్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 02888 నంబరు గల రైలు ప్రతి గురు, శుక్ర, శని, సోమ, మంగళ వారాల్లో ఉదయం 7.00 గంటలకు నిజాముద్దీన్‌లో బయలుదేరి మర్నాడు సాయంత్రం 4.30 గంటలకు విశాఖ చేరుతుంది.
02851 నంబరు గల రైలు ప్రతి సోమ, శుక్ర వారాల్లో ఉదయం 8.20 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు సాయంత్రం 5.50 గంటలకు నిజాముద్దీన్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 02852 నంబరు గల రైలు ప్రతి బుధ, ఆది వారాల్లో ఉదయం 5.10 గంటలకు నిజాముద్దీన్‌లో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 2.15 గంటలకు విశాఖ చేరుతుంది.
02245 నంబరు గల రైలు ప్రతి మంగళ, బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయ 10.50 గంటలకు హౌరాలో బయలుదేరి మర్నాడు సాయంత్రం 4.20 యశ్వంత్‌పూర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 02246 నంబరు గల రైలు ప్రతి గురు, శుక్ర, శని, సోమ, మంగళ వారాల్లో ఉదయం 11.00 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మర్నాడు సాయంత్రం 4.30 గంటలకు హౌరా చేరుతుంది.
02807 నంబరు గల రైలు ప్రతి మంగళ, శుక్ర వారాల్లో సాయంత్రం 5.55 గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరి మర్నాడు రాత్రి 8.30 గంటలకు చెన్నై చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 02808 నంబరు గల రైలు ప్రతి గురు, ఆది వారాల్లో ఉదయం 8.10 గంటలకు చెన్నైలో బయలుదేరి మర్నాడు ఉదయం 10.50 గంటలకు సంత్రాగచ్చి చేరుతుంది.
02703 నంబరు గల రైలు ప్రతిరోజు ఉదయం 8.35 గంటలకు హౌరాలో బయలుదేరి మర్నాడు ఉదయం 10.10 గంటలకు సికింద్రాబాద్
చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 02704 నంబరు గల రైలు ప్రతిరోజు మధ్యాహ్నం 3.55 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మర్నాడు సాయంత్రం 5.40 గంటలకు హౌరా చేరుతుంది.
08514 నంబరు గల రైలు ప్రతిరోజు ఉదయం 6.45 గంటలకు విశాఖలో బయలుదేరి అదేరోజు రాత్రి 8.45 గంటలకు కిరండోల్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08513 నంబరు గల రైలు ప్రతిరోజు ఉదయం 6.00 గంటలకు కిరండోల్‌లో బయలుదేరి అదేరోజు రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుతుంది.
Updated Date - 2020-12-15T05:58:33+05:30 IST