సింహాచలం, మాన్సాస్ ఫైళ్లు ఇక నేరుగా స్పెషల్ కమిషనర్‌కే
ABN, First Publish Date - 2020-10-03T09:17:11+05:30
విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానం, విజయనగరంలో మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన పరిపాలన, ఉద్యోగుల ఫైళ్లు అన్నీ ఇకపై నేరుగా దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌కు పంపాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖపట్నం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో సింహాచలం దేవస్థానం, విజయనగరంలో మాన్సాస్ ట్రస్టుకు సంబంధించిన పరిపాలన, ఉద్యోగుల ఫైళ్లు అన్నీ ఇకపై నేరుగా దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌కు పంపాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ ఫైళ్లు అసిస్టెంట్ కమిషనర్ పుష్పవర్దన్ పరిశీలించి జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ అజాద్‌కు పంపుతుండగా, ఆయన వాటిని చూసి కమిషనర్ కార్యాలయానికి పంపించేవారు.
ఈ విధానాన్ని మారుస్తూ గురువారం దేవదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇకపై అసిస్టెంట్ కమిషనర్ పుష్పవర్దన్ ఫైళ్లను పరిశీలించిన తరువాత జాయింట్ కమిషనర్‌కు పంపాల్సిన అవసరం లేదని, అలాగే కమిషనర్‌కి కాకుండా ప్రత్యేక కమిషనర్‌కు పంపాలని తాజా ఉత్తర్వుల్లో సూచించారు. విజయనగరంలో మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న మహారాజా కాలేజీని ప్రైవేటు పరం చేయడానికి రంగం సిద్ధమవు
Updated Date - 2020-10-03T09:17:11+05:30 IST