ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవంబరు నాటికి ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ రెడీ

ABN, First Publish Date - 2020-10-02T09:58:10+05:30

ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ పనులు నవంబరు నాటికి పూర్తవుతాయని, నాలుగు వైపులా అన్ని రోడ్లు అందుబాటులోకి వస్తాయని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) సంస్థ కమిషనర్‌ కోటేశ్వరరావు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవంబరు నాటికి ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ రెడీ

‘ఆంధ్రజ్యోతి’తో వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు

హిస్టరీ మ్యూజియానికి విదేశాల నుంచి మొక్కలు తెప్పిస్తున్నాం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):

ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ పనులు నవంబరు నాటికి పూర్తవుతాయని, నాలుగు వైపులా అన్ని రోడ్లు అందుబాటులోకి వస్తాయని విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) సంస్థ కమిషనర్‌ కోటేశ్వరరావు తెలిపారు.ఆయన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. ప్రస్తుతం ఫ్లై ఓవర్‌ మీదుగా విమానాశ్రయం వైపు నుంచి వాహనాలు వస్తున్నాయని, ఇంకో రెండు రోజుల్లో పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ చేతులు మీదుగా గోపాలపట్నం వైపు రాకపోకలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.


మిగిలిన పనులు నవంబరు నాటికి పూర్తి చేస్తామన్నారు. కైలాసగిరిపై ప్రపంచ బ్యాంక్‌ నిధులతో చేపట్టిన పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు.కాపులుప్పాడలో హిస్టరీ మ్యూజియానికి డీపీఆర్‌ సిద్ధమవుతోందని, అక్కడ ఏర్పాటుచేయడానికి విదేశాల నుంచి సైతం కొన్ని రకాల శిలలు, మొక్కలు తెప్పిస్తున్నామన్నారు. బీచ్‌ రోడ్డులో సీ హ్యారియర్‌ యుద్ధ విమానం ఏర్పాటుకోసం రాజీవ్‌ స్మృతిభవన్‌ ఎలివేషన్‌లో కొన్ని మార్పులు చేస్తున్నామని చెప్పారు. సిరిపురంలో వీఎంఆర్‌డీఏ కార్యాలయం ముందున్న ఖాళీ స్థలంలో పార్కింగ్‌ భవనం కోసం డీపీఆర్‌ వచ్చిందని, దాని ప్రకారం టెండర్లు పిలిచి పనులు అప్పగించాల్సి ఉందన్నారు. 

Updated Date - 2020-10-02T09:58:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising