ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలోనే శక్తివంతమైన పార్టీగా వైసీపీ

ABN, First Publish Date - 2020-03-13T11:26:00+05:30

దేశంలోనే శక్తివంతమైన పార్టీగా వైసీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లితాల తర్వాతే జీవీఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థుల ప్రకటన

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి


మద్దిలపాలెం, మార్చి 12: సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకుని దేశంలోనే శక్తివంతమైన పార్టీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అవతరించిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మద్దిలపాలెంలోని పార్టీ  కార్యాలయంలో ఆయ న జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలందరి అభివృద్ధికీ ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టామన్నారు. నైతిక విలువలు పాటిస్తూ అన్ని వర్గాల వారికి పదవుల్లో న్యాయం చేస్తున్నామన్నారు. అమ్మఒడి, రైతుభరోసా, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వంటి ఎన్నో పథకాలు విజయవంతంగా చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ర్టాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు. ప్రజల ఆమోదంతో తీసుకున్న నిర్ణయాలను ఎవరూ ఆపలేరన్నారు. విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ పేర్లను ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-13T11:26:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising