ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేయాలి
ABN, First Publish Date - 2020-03-16T06:54:04+05:30
కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆరు వారాల పాటు నిలిపివేయడం చాలా సంతోషకరమైన విషయమని, అయితే ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి మళ్లీ కొత్తగా నామినేషన్లతో ప్రక్రియను చేపట్టాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కోరారు.
రాష్ట్రంలో వైరస్‌లా ప్రబలిన దౌర్జన్యకాండ
కరోనాపై ఇక్కడ కూడా నిర్ణయం తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు
సీతమ్మధార, మార్చి 15: కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆరు వారాల పాటు నిలిపివేయడం చాలా సంతోషకరమైన విషయమని, అయితే ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి మళ్లీ కొత్తగా నామినేషన్లతో ప్రక్రియను చేపట్టాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కోరారు.
సీతమ్మధారలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని చూసి మన ప్రభుత్వం కూడా తగిన నిర్ణయం తీసుకుంటే మంచిదన్నారు. ఎన్నికల కారణంగా మన రాష్ట్రంలో దౌర్జన్యకాండ అనే వైరస్ ప్రబలిందని, ఈ వైరస్ ఇప్పటికే అనేక రూపాల్లో వ్యాప్తి చెందిందన్నారు. అందువల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి, ఎక్కడైతే దౌర్జన్యాలు జరిగాయో అక్కడ నాలుగైదు క్రేందాలను ఏర్పాటు చేసి మళ్లీ నామినేషన్లు వేసే ప్రక్రియ చేపడితే బాగుంటుందన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం రక్షించబడుతుందని విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు.
Updated Date - 2020-03-16T06:54:04+05:30 IST