ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జవాన్ల మృతదేహాలు విశాఖ తరలింపు

ABN, First Publish Date - 2020-03-25T12:06:29+05:30

జవాన్ల మృతదేహాలు విశాఖ తరలింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడేరు, మార్చి 24: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో సుక్మా జిల్లా చింతల్‌నాల్‌ అడవుల్లో శనివారం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన 17 మంది జవాన్ల మృతదేహాలను రాయపూర్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ముగ్గురు జవాన్లు ఉండడంతో ఆయా మృతదేహాలను విశాఖపట్నం తరలించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సోమవారమే విశాఖపట్నం నుంచి మూడు అంబులెన్స్‌లను రాయపూర్‌ పంపించారు.


అక్కడి నుంచి మంగళవారం ఆ ముగ్గురు జవాన్ల మృతదేహాలను ఒడిశా రాష్ట్రం నవరంగపూర్‌ మీదుగా హుకుంపేట మండలం కామయ్యపేట మార్గంలో పాడేరు చేరుకుని విశాఖపట్నం సీఆర్‌పీఎఫ్‌ హెచ్‌క్వార్టర్స్‌కు తరలించారు. అయితే ఈ జవాన్ల మృతదేహాల తరలింపు వ్యవహారం మొత్తం ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ పర్యవేక్షణలో జరగడంతో విశాఖ జిల్లా పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు.

Updated Date - 2020-03-25T12:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising