రాష్ట్రాభివృద్ధికి అందరూ కృషి చేయాలి
ABN, First Publish Date - 2020-03-16T06:52:49+05:30
రాష్ట్రాభివృద్ధికి అందరూ కృషి చేయాలని వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి
మహారాణిపేట, మార్చి 15: రాష్ట్రాభివృద్ధికి అందరూ కృషి చేయాలని వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హోటల్ నోవాటెల్‌లో చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్దిపథంలో నడిపేందుకు... అన్ని జిల్లాలను అభివృద్ధి చేసేందుకు మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
విశాఖ నగరం పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు పెట్టుబడుదారులకు స్వర్గధామం అని విజయసాయిరెడ్డి అన్నారు. అందువల్ల పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందకురావాలని పిలుపునిచ్చారు. అలాగే సుందరమైన విశాఖ నగరం చలనచిత్ర పరిశ్రమల ఏర్పాటుకు, పర్యాటకానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుదన్నారు. నగరంలో మెట్రో రైల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వరుణ్ గ్రూప్స్ అధినేత ప్రభుకిశోర్, శ్రావణి షిపింగ్ కంపెనీ ఎండీ సాంబశివరావు, వైసీపీ నగర అధ్యక్ష్యడు వంశీకృష్ణ శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, కంకటాల మల్లిక్, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, వైసీపీ నేత దాడి రత్నాకర్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-16T06:52:49+05:30 IST