ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాపారులకు రూ.రెండు కోట్ల రుణం

ABN, First Publish Date - 2020-11-13T06:13:06+05:30

యూనియన్‌ బ్యాంక్‌ పరిధిలో వ్యాపారులకు క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ ఫర్‌ మైక్రో యూనిట్స్‌ (సీజీఎఫ్‌ఎంయూ) ద్వారా రూ.రెండు కోట్లు రుణం మంజూరు చేస్తామని విశాఖపట్నం ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ (ఎఫ్‌జీఎం) బి.శ్రీనివాస్‌ షెట్టి అన్నారు.

చింతపల్లి బ్రాంచ్‌ని ప్రారంభిస్తున్న ఎఫ్‌జీఎం శ్రీనివాస్‌ షెట్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూబీఐ ఎఫ్‌జీఎం బి.శ్రీనివాస్‌ షెట్టి

చింతపల్లి, నవంబరు 12: యూనియన్‌ బ్యాంక్‌ పరిధిలో వ్యాపారులకు క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ ఫర్‌ మైక్రో యూనిట్స్‌ (సీజీఎఫ్‌ఎంయూ) ద్వారా రూ.రెండు కోట్లు రుణం మంజూరు చేస్తామని విశాఖపట్నం ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ (ఎఫ్‌జీఎం) బి.శ్రీనివాస్‌ షెట్టి అన్నారు. గురువారం ఆధునీకరించిన స్థానిక యూబీఐ బ్రాంచ్‌ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు ఎటువంటి పూచికత్తు లేకుండా రూ.పది లక్షల వరకు ముద్ర రుణం అందజేస్తామన్నారు. గిరిజన ప్రాంతం చింతపల్లి, సీలేరు, పాడేరు, రంపచోడవరంలో యూబీఐ సేవలను 1970లో ప్రారంభించామని, నేటికి 50 ఏళ్లు పూర్తిచేసుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీజీఎం అజయ్‌కుమార్‌, డిప్యూటీ రీజనల్‌ హెడ్‌ రమణమూర్తి, స్థానిక బ్యాంక్‌ మేనేజర్‌ అంబ్రిష్‌, ఫీల్డ్‌ అధికారి రాధాకృష్ణ, డిప్యూటీ బ్రాంచ్‌ హెడ్‌ హరికృష్ణ, వర్తక సంఘం నాయకులు పెదిరెడ్ల బేతాళుడు, జోగేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ కంకిపాటి వీరన్నపడాల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-13T06:13:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising