రెండు తలల మృత దూడ జననం
ABN, First Publish Date - 2020-11-28T04:49:59+05:30
చినగదిలికి చెందిన నక్క శ్రీనుకు చెందిన ఆవు శుక్రవారం రెండు తలల దూడను ఈనిందని తోటగరువు వెటర్నరీ వైద్యుడు డా.గణేష్ తెలిపారు.
మృతి చెందిన రెండు తలల దూడ
ఆరిలోవ, నవంబరు 27: చినగదిలికి చెందిన నక్క శ్రీనుకు చెందిన ఆవు శుక్రవారం రెండు తలల దూడను ఈనిందని తోటగరువు వెటర్నరీ వైద్యుడు డా.గణేష్ తెలిపారు. ఆవు అనారోగ్యానికి గురవడంతో వైద్యశాలకు తీసుకువచ్చారని, దానిని పరీక్షించి, ఈనేందుకు తగిన మందులిచ్చామన్నారు. అనంతరం మృతి చెందిన రెండు తలల మగ దూడ పుట్టిందని, మందుల ద్వారా ఆవును కాపాడామని, జన్యుపరమైన లోపాల వల్ల ఇలా వింత దూడ పుట్టిందని వైద్యుడు తెలిపారు.
Updated Date - 2020-11-28T04:49:59+05:30 IST