ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.219 కోట్ల పనులకు.. రెండంటే రెండే టెండర్లు!

ABN, First Publish Date - 2020-09-16T15:58:17+05:30

సాధారణంగా ఏ శాఖలోనైనా రూ.10-15 కోట్ల వ్యయంతో చేపట్టబోయే పనులకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అందులోను ఒకటి అసలు.. మరొకటి డమ్మీ

ఆర్‌ అండ్‌ బీలో అంతా మాయ

నెల్లూరుకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్‌ సంస్థకు పనులు దక్కే అవకాశం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): సాధారణంగా ఏ శాఖలోనైనా రూ.10-15 కోట్ల వ్యయంతో చేపట్టబోయే పనులకు టెండర్లు పిలిస్తే పదుల సంఖ్యలోనే పోటీపడుతుంటారు. అదే జిల్లా మొత్తం ఒకే ప్యాకేజీగా అయితే...ఇక చెప్పనవసరం లేదు. కానీ, ఆర్‌అండ్‌బీ (రోడ్లు, భవనాల శాఖ)లో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. జిల్లాలో బ్రిడ్జిలు, రహదారుల విస్తరణ, అభివృద్ధికి రూ.219 కోట్లతో టెండర్లను ఆహ్వానించగా..కేవలం రెండంటే రెండే టెండర్లు దాఖలయ్యాయి. అందులో ఒకటి అసలు కాగా..మరొకటి బినామీగా చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీలో ఈ పనులను ఒక ప్రముఖ నేతకు చెందిన వ్యక్తులకు కట్టబెట్టేందుకు ముందు నుంచి వ్యూహ రచన చేశారని, అందుకు అనుగుణంగానే టెండరింగ్‌ ప్రక్రియ సాగుతోందని తెలిసింది. రెండు టెండర్లు పడినప్పటికీ..నెల్లూరుకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్‌కు చెందిన సంస్థకు జిల్లా పనుల కాంట్రాక్టు దక్కే అవకాశముందని తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ముఖ్య నేత చక్రం తిప్పారని తెలిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త నిబంధనలతో జిల్లా ప్యాకేజీగా ఒక్కరికే పనులు కట్టబెట్టడంపై మిగిలిన కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్ల పొట్ట కొట్టే పనిగానే దీన్ని భావించాలని వారు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-09-16T15:58:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising